2022 సంక్రాంతి సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఓపక్క ఆర్ఆర్ఆర్, ఇంకోపక్క రాధేశ్యామ్.. కుదిరితే మధ్యలో భీమ్లా నాయక్.. ఇలా భారీ చిత్రాలతో బాక్సాఫీస్ మోత మోగిపోతుందని అనుకున్నారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముందు థియేటర్ల సమస్య తలెత్తుతుందని భీమ్లా నాయక్‌ను వాయిదా వేయించారు. తర్వాతేమో కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడిపోయాయి.
ఈ భారీ చిత్రాల మధ్య ఛాన్సుంటే చిన్న స్థాయిలో రిలీజ్ చేద్దామనుకున్న బంగార్రాజు ఇప్పుడు సంక్రాంతి రాబోతున్న అతి పెద్ద చిత్రంగా మారింది. ఐతే దాని రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధత నెలకొంది మొన్నటి వరకు. మరోవైపు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నేపథ్యంలో చిన్న సినిమాలు చాలానే సంక్రాంతి రేసులోకి వచ్చాయి. ముందు వెనుక చూడకుండా సంక్రాంతి రిలీజ్ అంటూ ముందు కర్చీఫ్ అయితే వేసేశారు. కానీ అలా అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సినిమాలన్నీ ఏమీ సంక్రాంతికి విడుదల కావట్లేదు. ప్రస్తుతానికి పండక్కి నాలుగు సినిమాలు ఖరారైనట్లుగా కనిపిస్తోంది.
బంగార్రాజును జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వచ్చేశాయి. ఇక గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న హీరో మూవీని జనవరి 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా పెట్టింది చిత్ర బృందం. ఇక దిల్ రాజు సోదరుడి కొడుకు అశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న రౌడీ బాయ్స్ జనవరి 14నే విడుదల కాబోతున్నట్లు సమాచారం.
దీంతో పాటు అదే రోజు సిద్ధు జొన్నలగడ్డతో సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు తీసిన డీజే టిల్లు కూడా రాబోతోంది. అంటే పండుగ రోజు మూడు సినిమాలు, తర్వాతి రోజు మరో సినిమా రాబోతోందన్నమాట. మొత్తంగా సంక్రాంతికి ఈ నాలుగు సినిమాలే ఖరారైనట్లు కనిపిస్తోంది. సూపర్ మచ్చి, 7 డేస్ 6 నైట్స్, శేఖర్.. ఇలా వేరే సినిమాలు చాలానే సంక్రాంతి రిలీజ్ అంటూ హడావుడి చేశాయి కానీ.. అవేవీ పండక్కి రావట్లేదు. అలాగే తమిళ అనువాద చిత్రాలు వలిమై, సామాన్యుడు కూడా వాయిదా పడిపోయాయి.
This post was last modified on January 7, 2022 9:35 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…