వలిమై అని తమిళ సినిమా. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో ఖాకి దర్శకుడు హెచ్.వినోద్ రూపొందించిన చిత్రమిది. బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్ పాత్ర పోషించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అజిత్ గత సినిమాల్లాగే దీన్ని కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం, రాధేశ్యామ్ కూడా అనుమానంగా మారడంతో ఈ చిత్రాన్ని తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేసే అవకాశముంది. ఐతే ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేసినపుడు కనీసం తెలుగు టైటిల్ పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితి రావడమే దారుణం. ఈ సినిమాకు ఇంతకుముందు తమిళ టైటిల్‌కు సమాన అర్థం వచ్చేలా బలం అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి.
ఆ టైటిల్‌తో పోస్టర్లు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. వలిమై అనే టైటిలే పెట్టి అధికారికంగా పోస్టర్లు వదిలారు. జనవరి 13న రిలీజ్ అని కూడా ప్రకటించారు. టాలీవుడ్ పీఆర్వోలందరూ అఫీషియల్‌గానే ఈ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఐతే మరీ మన వాళ్లకు అర్థం కూడా తెలియని తమిళ టైటిల్‌తో తెలుగులో సినిమాను రిలీజ్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఒకవేళ హీరో పేరు సినిమా టైటిల్‌గా ఉంటే.. అలాంటపుడు తెలుగులో అదే పేరు పెట్టినా సరే అనకోవచ్చు.
కానీ ఇక్కడ కేస్ అది కాదు. ఈ సినిమాలో హీరో పేరేంటో చూసి దాన్నే తెలుగులో టైటిల్‌గా పెట్టినా ఓకే. కానీ ఇలా వలిమై అనే తమిళ పదాన్నే టైటిల్‌గా పెట్టి సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం విడ్డూరం. ఇంతకుముందు సింగం-2, సింగం-3 సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐతే కనీసం సింహం, సింగం పదాలు దగ్గరగా ఉంటాయని అయినా సరిపెట్టుకోవచ్చు. కానీ వలిమై అంటే ఏంటో తెలియకుండా మన వాళ్లు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకోవడమేంటో?
This post was last modified on January 4, 2022 9:45 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…