ఇప్పుడు అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య చిన్న అంతరం వచ్చింది. చిరు మీద చిన్నపాటి యుద్ధం ప్రకటించాడు బాలయ్య. అయితే చిరంజీవి ఎప్పుడూ బాలయ్యను ఉద్దేశించి ఏమీ అన్నది లేదు. బుధవారం కూడా బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రేమగా ఒక ట్వీట్ పెట్టాడు. ఒకప్పుడు బాలయ్య సినిమాకు తన వంతుగా ప్రమోషన్ కూడా చేసిపెట్టిన పెద్ద మనసు చిరంజీవిది.
ఈ అరుదైన సంఘటన 1991లో జరిగింది. ఆ ఏడాది జులై 18న నందమూరి బాలకృష్ణ మైల్ స్టోన్ మూవీ ‘ఆదిత్య 369’ విడుదలైంది. అప్పట్లో అదో పెద్ద సంచలనం. అప్పటి తెలుగు సినిమా మార్కెట్‌ను మించి కోటిన్నర దాకా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు నిర్మాత శివలెంక ప్రసాద్. విడుదలయ్యాక సినిమాకు మంచి స్పందనే వచ్చింది కానీ.. ఇలాంటి అరుదైన చిత్రాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారాయన.
ఇదొక ప్రయోగాత్మక చిత్రం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైపోతారేమో.. వాళ్లను కూడా థియేటర్లకు రప్పించడానికి ఏదైనా చేయాలనుకున్నారు. ఇందుకోసం చిరంజీవితో యాడ్స్ చేయించాలనుకున్నారు బాలయ్య, ప్రసాద్. వారి విన్నపానికి చిరు అంగీకరించారు. చిరుతో ఈ సినిమా గొప్పదనం చెప్పిస్తూ యాడ్స్ తయారు చేయించి దూరదర్శన్‌లో వేశారు. అవి కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వాళ్లు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లారు. సినిమా అంచనాల్ని మించి విజయం సాధించింది.
పెట్టుబడి మీద ఆరు రెట్లు.. అంటే రూ.9 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకుంది. అలా బాలయ్య సినిమాకు చిరు ఇతోధిక సాయం చేశారు. దీన్ని బట్టి బాలయ్యతో చిరుకు ఎంత మంచి స్నేహం ఉండేది.. ఒక మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ఎంతగా తపించేవారు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఉదంతాల్ని దృష్టిలో ఉంచుకుని అయినా బాలయ్య ఇప్పుడు కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిదేమో.
This post was last modified on June 10, 2020 9:36 pm
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…