అక్కినేని నాగార్జున సినిమా ‘బంగార్రాజు’ఫై రెండు వారాల ముందు వరకు ప్రేక్షకుల్లోనే కాక ట్రేడ్ వర్గాల్లో కూడా పెద్దగా ఆసక్తి కనిపించలేదు. బ్లాక్‌బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ఇది ప్రీక్వెల్ అయినప్పటికీ.. గత కొన్నేళ్లలో నాగ్ మార్కెట్ బాగా దెబ్బ తినేయడం, ఇప్పుడు ఈ సినిమా రిలీజవుతున్న టైమింగ్ కూడా బ్యాడ్ కావడమే అందుక్కారణం.
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు రిలీజవుతున్న సంక్రాంతి సీజన్లో సినిమాను రిలీజ్ చేస్తుండటంతో దీనిపై ఎవరూ అంతగా దృష్టిసారించలేదు. ఆ భారీ చిత్రాలకు పోగా ఈ చిత్రానికి ఏ మాత్రం థియేటర్లు దక్కుతాయో అన్నది కూడా సందేహంగానే కనిపించింది. దీంతో బయ్యర్లు ఈ సినిమాపై పెద్దగా పెట్టుబడి పెట్టడానికి సాహసించని పరిస్థితి నెలకొంది. ఓ మోస్తరు రేట్లకే సినిమాను అమ్మేసి, కుదిరినంత మేర థియేటర్లలో రిలీజ్ చేసి.. మంచి టాక్ వస్తే తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ నాగ్.
ఐతే కొన్ని రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయింది. ‘రాధేశ్యామ్’ రాక కూడా అనుమానంగా మారింది. దీంతో ఒక్కసారిగా ‘రాధేశ్యామ్’ డ్రైవర్ సీట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ట్రేడ్‌లో ఈ సినిమా మీదే అమితాసక్తి కనిపిస్తోంది. సినిమాకు ఫ్యాన్సీ రేట్లిచ్చి వివిధ ఏరియాల హక్కులు తీసుకోవడానికి బయ్యర్లు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనడంలో సందేహమే లేదు.
సంక్రాంతి రేసులోకి హఠాత్తుగా వచ్చి పడ్డ మిగతా చిన్న సినిమాలపై ఎవరికీ అంతగా ఆసక్తి కనిపించడం లేదు. ఫ్యామిలీస్ అంతా ఈ సినిమా కోసం పోటెత్తే అవకాశాలున్నాయి. సినిమాకు మంచి టాక్ రావాలే కానీ.. ‘సోగ్గాడే..’ను మించి ఈ చిత్రం సక్సెస్ కావడానికి ఆస్కారముంది. ‘రాధేశ్యామ్’ సంగతేంటో చూసి ‘బంగార్రాజు’కు డేట్ ఖరారు చేయాలని నాగ్ చూస్తున్నాడు. ముందు జనవరి 15కు అనుకున్నప్పటికీ.. ఇప్పుడు జనవరి 12నే సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on January 4, 2022 4:37 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…