దర్శకధీరుడు రాజమౌళితో సినిమాలు చేయాలని చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా చాలా కాలంగా రాజమౌళితో సినిమా చేయాలనుకుంటున్నారు. సోలో నిర్మాతగా తన పేరు పడాలనేది కరణ్ జోహార్ కోరిక. ఈ విషయంలో రాజమౌళితో డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా రాజమౌళి సినిమాలకు హిందీలో బ్యాక్ బోన్ గా నిలిచారు కరణ్.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నారు. అయితే నిర్మాతగా రాజమౌళితో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమాగా రూపొందుతుందట. రాజమౌళి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. రాజమౌళి అంటే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తొస్తాయి.
కానీ కరణ్ జోహార్ నిర్మాణంలో చేయబోయేది మాత్రం ఓ ప్రయోగాత్మక సినిమా అని తెలుస్తోంది. ఇందులో అందరూ కొత్తవాళ్లు లేదంటే యంగ్ నటులు ఉంటారని తెలుస్తోంది. గతంలో కూడా రాజమౌళి స్టార్లు లేకుండా సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అలానే హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తరువాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ విషయాన్ని ఆయన అఫీషియల్ గా వెల్లడించారు. కానీ మధ్యలో ఏమైనా గ్యాప్ దొరికితే ఈ హిందీ ప్రాజెక్ట్ మొదలవుతుంది. లేదంటే మహేష్ సినిమాను పూర్తి చేసి అప్పుడు బాలీవుడ్ సినిమాను స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తారేమో చూడాలి!
This post was last modified on January 4, 2022 11:53 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…