ఊరించి ఊరించి ఉన్నట్లుండి.. ఉన్నట్లుండి వాయిదా పడిపోయింది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. రెండు వారాల ముందు వరకు అస్సలు ఊహించని పరిణామం ఇది. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. థియేటర్ల బుకింగ్స్ పూర్తయింది. విదేశాల్లో అయితే టికెట్ల అమ్మకాలు కూడా చాలా రోజుల ముందే మొదలయ్యాయి. జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్లు కూడా ఒక రేంజ్‌లో చేశారు. ‘బాహుబలి’తో పోలిస్తే ఈ సినిమా రిలీజ్ ముంగిట రాజమౌళి చాలా రిలాక్స్డ్‌గా కనిపించాడు.
ప్రమోషన్లను ముందుండి నడిపించాడు. సినిమా తీయడానికి పడ్డ కష్టానికి తోడు ఆయన ప్రమోషన్ల కోసం కూడా తన టీంతో కలిసి చాలా కష్టపడ్డాడు. వివిధ భాషలకు కేంద్రంగా ఉండే ప్రధాన నగరాల్లో ఈవెంట్లు చేశారు. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇందుకోసం చాలా రోజులే వెచ్చించాడు. ప్రమోషన్ కోసం ఖర్చు కూడా కాస్త ఎక్కువే అయింది. ఆ బడ్జెట్‌తో మీడియం రేంజ్ సినిమా కూడా తీయొచ్చంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా నడిచింది.
విడుదలకు చాలా సమీపంలో ఇలా సినిమాను వాయిదా వేయడం వల్ల చాలా నష్టాలే ఉన్నాయి చిత్ర బృందానికి. ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చు, సమయం, ఎనర్జీ అంతా వేస్ట్ అయింది. దీనికి తోడు సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ చాలానే ఉపయోగించారు. ఐతే ఇప్పుడు మళ్లీ ఇంకో డేట్ ఎంచుకుంటే.. కొత్తగా ఆఫ్ లైన్, ఆన్ లైన్ ప్రమోషన్లు చేయాలి. ఇక సినిమా నుంచి రిలీజ్ చేయడానికి కంటెంట్ కూడా తక్కువే ఉంటుంది.
మళ్లీ టీం అంతా వివిధ నగరాల్లో తిరిగి ఈవెంట్లు చేయాలంటే చాలా కష్టం. ఇప్పట్లా హైప్ తీసుకురావడానికి మళ్లీ చాలా కష్టపడాలి. ఆల్రెడీ చేశాం కదా అని.. ఇంకోసారి చేయకుండా వదిలేసే రకం కాదు జక్కన్న. ఇక ఇప్పటికే సినిమా బాగా ఆలస్యం కావడం వల్ల వడ్డీల భారం బాగానే పడింది. ఇప్పుడు అవి మరింత తడిసి మోపెడవుతాయి. నష్టాలు వస్తాయని కాదు కానీ.. ఆదాయంలో కోత పడుతుంది. మళ్లీ థియేటర్ల బుకింగ్స్, కొత్తగా అగ్రిమెంట్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాల్లో మార్పులు చేర్పులు.. ఇలా చాలా తలనొప్పులే ఉంటాయి చిత్ర బృందానికి.
This post was last modified on January 2, 2022 8:43 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…