విజయ్ దేవరకొండ హీరోగా తన కెరీర్ మొదలుపెట్టిన తరువాత వరుసగా సినిమాలను విడుదల చేస్తూ వచ్చాడు. ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు అతడి రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఆ తరువాత ఫ్లాప్ లు వచ్చినప్పటికీ.. అవి విజయ్ పై ఎంతమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇదిలా ఉండగా.. విజయ్ రెండేళ్లుగా ఒక సినిమా కోసమే వర్క్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ‘లైగర్’ సినిమా కోసం తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ల సమయాన్ని కేటాయించేశాడు విజయ్. 2020 జనవరిలో మొదలైన ఈ సినిమా 2022 ఆగస్టులో విడుదల కానుంది. హీరోగా ఎంతో పాపులారిటీ పొందిన ఒక యంగ్ హీరో రెండేళ్లపాటు తన కాల్షీట్స్ ఒక సినిమాకి ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఈ గ్యాప్ లో అతడు రెండు, మూడు సినిమా తీసేసి బాగా సంపాదించుకోవచ్చు.
కానీ విజయ్ మాత్రం అలా చేయలేదు. ‘లైగర్’ సినిమాపై అతడి చాలా నమ్మకం ఉంది. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు విజయ్. పూరి కూడా ఈ సినిమా సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. ‘లైగర్’ షూటింగ్ సమయంలో పూరికి, విజయ్ కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా విజయ్ తో చేయాలనుకుంటున్నారు పూరి.
అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ‘లైగర్’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ.. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. దర్శకుడు శివ నిర్వాణ చాలా రోజులుగా విజయ్ దేవరకొండ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ముందుగా విజయ్ ఏ ప్రాజెక్ట్ మొదలుపెడతారో చూడాలి!
This post was last modified on January 2, 2022 6:28 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…