Movie News

ఇండస్ట్రీ పెద్దగా ఉండను: చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణరావు ఉన్నంత కాలం ఆయనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేవారు. ఎవరికే సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్లేవారు. ఆయనే పంచాయితీలు పెట్టి తగవులు తీర్చేవారు. ఇండస్ట్రీ తరఫున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలన్నా ఆయనే ముందుండి నడిపించేవారు. ఐతే ఆయన మరణానంతరం ఆ కుర్చీ ఎక్కడానికి చాలామందికి ధైర్యం సరిపోలేదు. ఇది లేని పోని తలనొప్పిగా భావించారు చాలామంది. అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి బాధ్యత తీసుుకన్నారు.

ఈ విషయంలో కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఇండస్ట్రీ పెద్ద స్థానంలో కూర్చోబెట్టారు. ఇదేమీ అధికారిక పదవి కాదు. చిరంజీవి కూడా అలా భావించలేదు. ముందు నుంచే చిరంజీవిది పెద్ద మనసు. ఆయన సేవా కార్యక్రమాల సంగతి తెలిసిందే. ఈ బాధ్యత తీసుకున్నాక మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించారు. కరోనా టైంలో గొప్పగా సినీ కార్మికులను ఆదుకున్నారు. ఐతే కొన్ని నెలల కిందట ‘మా’ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో చిరు కొంత మనస్తాపం చెందినట్లే కనిపిస్తున్నారు.

ఇండస్ట్రీ పెద్ద హోదా గురించి తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని.. ఆ పదవి వద్దని.. తాను పంచాయితీలు చేయాలనుకోవట్లేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. అవసరానికి ఎవరికైనా అండగా ఉంటానని.. కానీ అనవసర వివాదాల్లో తాను తలదూర్చనని.. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకిష్టం లేదని చిరు అన్నారు. ఐతే సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ సాయం అవసరమైనా సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని చిరు స్పష్టం చేశారు.

ఇండస్ట్రీ పెద్దగా అనధికారిక బాధ్యత తీసుకున్నాక చిరు ఇండస్ట్రీ కోసం ఎంతో చేసినా ఆయన మాటలు పడాల్సి వచ్చింది. వీలైనంత మేర అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేసినా కొన్ని విమర్శలు తప్పలేదు. ‘మా’ ఎన్నికల్లో నుంచి నుంచి పరోక్ష మద్దతు పొందిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడం చిరును ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. పైగా ఆ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచాక.. ఇండస్ట్రీ పెద్ద పదవి ఖాళీగా ఉందని, ఆ స్థానంలోకి రావాలని మోహన్ బాబును నరేష్ కోరడం కూడా చిరును బాధించి ఉండొచ్చు. తాను ఇంత చేసినా.. ఇలాంటి కామెంట్లు వినాల్సి వచ్చిన నేపథ్యంలో చిరు ఈ హోదా తనకు వద్దని స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు.

This post was last modified on January 2, 2022 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

1 minute ago

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

43 minutes ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

1 hour ago

అమిత్ షాకు షర్మిల కౌంటర్

పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…

1 hour ago

పార్ల‌మెంటు ముందే అధికార-ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌

దేశ చ‌రిత్ర‌లో.. ముఖ్యంగా ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ప‌రిఢ‌విల్లుతున్న భార‌త దేశంలో తొలిసారి ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌..…

2 hours ago

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

3 hours ago