ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టడానికి ఎలా సంసిద్ధమై వెళితే బాగుంటుందని రాజమౌళి టీం ప్రణాళిక వేసుకుంటోంది. జూన్ లో షూటింగ్ మొదలు పెట్టేద్దాం అనుకున్నారు కానీ జులైలో అయితే టెన్షన్ ఫ్రీ ఉండొచ్చని అప్పటికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం ఆలియా భట్ సీన్స్ కానీ, అజయ్ దేవగన్ సీన్స్ కానీ ఇప్పుడు చేయడం కష్టమని భావిస్తున్నారు.
కరోనా వైరస్ త్రెట్ బాగా తగ్గేవరకు బాలీవుడ్ నటులు అందుబాటులో ఉండరు కనుక వాళ్ళ పార్ట్ సెప్టెంబర్ తర్వాతకి వాయిదా వేసి, మిగతా భాగం తీయాలని చూస్తున్నారు. అంటే రామ్ చరణ్ పార్ట్ మొదలు కావడానికి సమయం పడుతుందన్నమాట. తారక్ తో చేయాల్సిన సీన్స్ తో పాటు, చరణ్ తో తారక్ కాంబినేషన్ సీన్స్ ముందు చేసేద్దాం అని డిసైడ్ అయ్యారట. దాంతో కొన్ని కాంబినేషన్ సీన్స్ మినహా తారక్ ఫ్రీ అయిపోతాడట.
ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ ఎంత డిలే అయినా కానీ, తారక్ వర్క్ అయితే ఈ ఏడాది చివరిలోగా పూర్తి అవుతుందని, అతను త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చని అంటున్నారు. ఇక ఆచార్య కోసం రామ్ చరణ్ కి రాజమౌళి నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు.
This post was last modified on June 10, 2020 9:37 pm
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…