‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఓవర్ నైట్ కార్తికేయ జాతకం మారిపోయింది. ఈ యంగ్ హీరో వెంటనే చాలా బిజీ అయిపోయాడు. మూడేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు చేసేశాడు. కానీ తన దగ్గరికొచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకుని హడావుడిగా లాగించేయడంతో అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. చివరికి అల్లు అరవింద్ ప్రొడక్షన్లో చేసిన ‘చావు కబురు చల్లగా’ సైతం అతణ్ని తీవ్ర నిరాశకే గురి చేసింది. లేటెస్టుగా కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ అయితే రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
దెబ్బకు టాలీవుడ్లో కార్తికేయ కెరీర్ బాగా డల్లయిపోయింది. అతడి మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక తెలుగులో అతడి కెరీర్ ముందుకు సాగడమే సందేహంగా మారింది. కానీ ఇదే టైంలో కార్తికేయ.. కోలీవుడ్లో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీకి రెడీ అవుతుండటం విశేషం.కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ సినిమాతో కార్తికేయ తమిళంలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
అజిత్ కొత్త చిత్రం ‘వలిమై’లో కార్తికేయనే ప్రధాన విలన్. ముందు ఈ సినిమాలో కార్తికేయ నటిస్తున్నాడంటే ఏదో సహాయ పాత్ర అనుకున్నారు కానీ.. మెయిన్ విలన్ పాత్ర తనే చేస్తున్నాడని అనుకోలేదు. కానీ ఫస్ట్ టీజర్ రిలీజయ్యాకే తెలిసిందే అజిత్‌కు దీటైన విలన్ పాత్ర చేస్తున్నాడని. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో కార్తికేయను చూసి అటు తమిళ ప్రేక్షకులు, ఇటు తెలుగు వాళ్లు వావ్ అనుకుంటున్నారు.
ఇంత భారీ చిత్రంలో, అజిత్ లాంటి సూపర్ స్టార్‌ను సవాలు చేసే దీటైన విలన్ పాత్ర చేయడం.. ప్రతి షాట్లోనూ తన ప్రత్యేకతను చాటుకోవడంతో కార్తికేయ అందరిలోనూ బాగా రిజిస్టర్ అయిపోయాడు. సినిమా స్యూర్ షాట్ హిట్ లాగా కనిపిస్తోంది. ‘వలిమై’ అంచనాలకు తగ్గట్లు ఉండి, కార్తికేయ పాత్ర కూడా క్లిక్ అయితే.. తమిళంలో అతను మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోతాడేమో. తెలుగులో కెరీర్ పోయినా తమిళంలో సెటిలయ్యేందుకు ‘వలిమై’ బాగానే కలిసొచ్చేలా ఉంది.
This post was last modified on December 31, 2021 9:15 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…