లూసిఫర్ ని దెబ్బ కొట్టిన బాలయ్య!

మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్నితెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న చిరు అది పూర్తయిన తర్వాత సాహో దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నారు. లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్ గెటప్ బాగా ఆకట్టుకుంది. తెల్ల చొక్కా, తెల్ల పంచెతో ఆయన లుక్ అదరగొట్టింది.

చిరంజీవి ఈ లుక్ లో బాగుంటారని అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ లుక్ బాలకృష్ణతో బోయపాటి శ్రీను తీస్తున్న సినిమాలో వాడేశారు. బాలయ్య పుట్టినరోజుకి విడుదల చేసిన టీజర్ లో బాలయ్య లుక్ చూసి లూసిఫర్ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ గెటప్ దాదాపుగా ఇదే ఉంటుందని టాక్.

మరి లూసిఫర్ లో చిరు గెటప్ మార్చేస్తారా లేక ఇలాగే కంటిన్యూ చేసేస్తారా అనేది ఇంకా తెలీదు. మొత్తానికి చిరు, బాలయ్య మధ్య జరుగుతున్నా కోల్డ్ అండ్ హాట్ వార్ లో ఈ లుక్ కూడా ఒక చిన్న టాపిక్ అయింది.