Movie News

టికెట్ల రేట్లు బూమరాంగ్?

టికెట్ల రేట్ల విషయంలో ఏపీలో చూస్తే అనావృష్టి.. తెలంగాణలో చూస్తే అతివృష్టి అన్నట్లే ఉంది పరిస్థితి. ఏపీలో కనీస ధరలు కూడా కరవై.. థియేటర్ల మెయింటైనెన్స్‌ కష్టమయ్యే పరిస్థితి ఉంది. నగర పంచాయితీలు, మున్సిపాలిటీలు అని తేడా చూపించకుండా కనీస ధర రూ.100 ఉండేలా చూడాలని అక్కడ ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ నెలల తరబడి పరిస్థితి మారకపోవడంతో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

కానీ తెలంగాణలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ ఇక్కడ పరిశ్రమ కోరుకునే స్థాయిలోనే రేట్లు ఉన్నాయి. మల్టీప్లెక్సుల్లో కనీస ధర రూ.150గా ఉంది. ఏఎంబీ సినిమాస్ లాంటి పెద్ద మల్టీప్లెక్సులు రూ.200 కనీస ధరతో టికెట్లు అమ్ముతున్నాయి. సింగిల్ స్క్రీన్లలో సగటు ధర రూ.110-120గా ఉన్నాయి. ఈ ధరలు ప్రేక్షకుడికీ ఓకే. అటు ఇండస్ట్రీకి కూడా ఓకే అనే చెప్పాలి.

కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. అక్కడే వచ్చింది సమస్య.కొత్త సినిమాలకు గతంలో సింగిల్ స్క్రీన్లలో రూ.150కి, మల్టీప్లెక్సుల్లో రూ.200కి రేట్లు పెంచుకునేవారు. కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్లలోనే కనీస ధర రూ.200 చేసేశారు. మల్టీప్లెక్సుల రేటు రూ.250తో మొదలవుతోంది. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా భారమే. పెద్ద సినిమాకు డిమాండ్ ఉంది కదా అని మరీ ఈ స్థాయిలో రేట్లు పెంచడమేంటి అని ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇది చాలదన్నట్లు ఇప్పుడు మొత్తంగానే టికెట్ల రేట్లు పెంచేశారు. ఇటీవల సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు రూ.150 వరకు, మల్టీప్లెక్సుల్లో రూ.200 నుంచి 350 వరకు రేటు పెంచుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఐతే ప్రేక్షకుల సౌలభ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన ఎగ్జిబిటర్లు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్లు చాలా వరకు రూ.150కి రేటు పెంచేశాయి. మల్టీప్లెక్సుల రేటు రూ.200తో మొదలైంది. ఇన్నాళ్లూ ప్రసాద్ మల్టీప్లెక్సులో రూ.150గా ఉన్న ధర ఒక్కసారిగా రూ.295కి పెంచి పడేశారు. ఇక బుక్ మై షోలో టికెట్ బుక్ చేస్తే ఇంకో రూ.20 అదనం. ఈ శుక్రవారం ‘అర్జున ఫల్గుణ’ అనే చిన్న సినిమా రిలీజవుతోంది.

అలాంటి సినిమాకు రూ.315 రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకుని థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని సామాన్య ప్రేక్షకుడు అనుకుంటాడా? ఆ డబ్బులకు సంవత్సరం మొత్తానికి ఆహా లాంటి ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ వచ్చేస్తున్నపుడు థియేటర్‌కు వెళ్లి ఒక్కరు అంత రేటు పెట్టి ఒక సినిమా చూడాలంటే మనసొప్పుతుందా? చూస్తుంటే ఈ ధరల పెంపు బూమరాంగ్ అయి పరిశ్రమకు చేటు చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇది శాపంలా మారే ప్రమాదం ఉంది.

This post was last modified on December 30, 2021 6:54 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

1 hour ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

3 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

3 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

3 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

7 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

7 hours ago