మంచు మోహన్ బాబు కేవలం సినిమాలనే నమ్ముకుని ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఇక్కడ సంపాదించిన డబ్బులతో తిరుపతిలో విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి దాన్ని భారీ స్థాయిలో విస్తరించి తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద విద్యా సంస్థల్లో ఒకదానిగా తీర్చిదిద్దారు. దీన్నుంచి ఆయనకు భారీగానే ఆదాయం వస్తుంటుంది ఏటా. సినిమాల ద్వారా చాలా ఏళ్ల నుంచి ఆదాయం రాకపోగా.. రివర్సులో నష్టాలొస్తున్నాయి. అయినా ఆయనకు ఆర్థికంగా ఢోకా లేకపోయింది. విద్యా సంస్థలు గొప్పగా నడుస్తున్నాయి. ఆయనకు ఆదాయాన్ని పెంచుతున్నాయి.
ఈ ఆదాయంతోనే ఆయన చాలా ఏళ్ల కిందట శంషాబాద్‌లో కొన్ని ఎకరాల స్థలం కొనుక్కున్నారు. అందులో ఒక రాజప్రసాదం లాంటి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లున్న స్థలం కంటే చుట్టూ ఉన్న ఉద్యానవనం కొన్ని రెట్లు పెద్దది. ఆ ఇంటి గురించి అందరూ చెబుతుంటే వినడమే తప్ప సామాన్య జనాలకు పెద్దగా తెలియదు.
ఇప్పుడు మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి ఆ ఇంటి విశేషాలను వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకుంది. కొన్ని రోజుల కిందటే ఆమె తన తండ్రి ఇంటికి సంబంధించి హోమ్ టూర్ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో ఇంటి మీద వీడియో తీస్తున్నందుకు మోహన్ బాబు కోప్పడట్లు కనిపించారు. కానీ అసలు వీడియో చూస్తే అక్కడ నిజంగా ఏ గొడవా జరగలేదని అర్థమైంది. ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మొత్తంగా ఇంటితో పాటు ఉద్యానవనంలోని అన్ని విశేషాలను ఆమె ఈ వీడియోలో పంచుకుంది.
అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం మూడు ఫోర్లున్న ఇంటిలోపల ఒక్కో గదిని చూస్తే కళ్లు చెదరక మానదు. పెద్ద హోం థియేటర్ మేడ మీద స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్.. భారీ డైనింగ్ రూం, ఆఫీస్ రూమ్స్, లివింగ్ రూమ్స్.. ఇలా అన్నీ చూస్తే మోహన్ బాబు ఇంటి వైభవం చూసి సెలబ్రెటీలకు సైతం కళ్లు కుట్టక మానదు. ఫిలిం సెలబ్రెటీలందరూ సిటీలో కాంక్రీట్ జంగిల్స్‌లో ఉంటే.. మోహన్ బాబు మాత్రం ప్రకృతి మధ్య రాజప్రసాదం లాంటి ఇల్లు కట్టుకుని ఇంత ప్రశాంతంగా గడుపుతున్నందుకు కూడా ఆయనపై అసూయ కలగొచ్చు.
This post was last modified on December 30, 2021 6:05 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…