‘బిగ్ బాస్’ షోను వ్యతిరేకించే వాళ్లు వ్యతిరేకిస్తూనే ఉంటారు కానీ.. ఆ షో ఆదరణ అంతకంతకూ పెరిగిపోతున్న మాట వాస్తవం. ఈ షోలో పాల్గొన్న వాళ్లకు వచ్చే పాపులారిటీనే వేరు. అనామకుల్లా షోలో అడుగు పెట్టి.. సెలబ్రెటీ స్టేటస్‌తో హౌస్ నుంచి బయటికి వస్తుంటారు కంటెస్టెంట్లు. ఈ సారి షోలో అడుగు పెట్టే ముందు సన్నీ గురించి కూడా తెలిసింది కొందరికే.
వీడియో జాకీ అయిన అతను అంత ఫేమస్ ఏమీ కాదు. కానీ షోలో రోజులు గడిచేకొద్దీ అతడికి ఆదరణ అమాంతం పెరిగిపోయింది. చివరికి అతను అందరినీ వెనక్కి నెట్టి, యూట్యూబ్ సెలబ్రెటీ అయిన షన్నును ఓడించి మరీ టైటిల్ గెలిచి ఔరా అనిపించాడు. షో నుంచి బయటికి వచ్చాక సన్నీకి అపూర్వమైన ఆదరణే దక్కుతోంది. రోజులు గడిచేకొద్దీ మాజీ విన్నర్ల మాదిరే అతను కూడా ఫేడవుట్ అవుతాడో లేదో చూడాలి కానీ.. ప్రస్తుతానికైతే సన్నీ టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తున్నాడు.
సన్నీకి ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ‘బిగ్ బాస్’ విన్నర్ అయ్యాక సన్నీ తొలిసారి అభిమానులతో వీడియో లైవ్ చేశాడు. వేలమంది లైవ్‌లోకి వచ్చారు. అందులో యుఎస్ నుంచి మాట్లాడిన ఒక మిడిలేజ్డ్ లేడీ సన్నీ ముందు ఒక ఊహించని ప్రపోజల్ పెట్టింది. తన కూతురిని పెళ్లి చేసుకోవాలని సన్నీని కోరిందామె. అంతే కాదు.. తన కూతుర్ని చేసుకుంటే వంద కోట్ల కోట్ల కష్టం ఇస్తానని కూడా ఆఫర్ చేశారు.
దీనికి సన్నీ స్పందిస్తూ.. తనను భరించాలంటే చాలా ఓపిక ఉండాలన్నాడు. అందుకు ఆమె సరే అంది. మీరు అలా అన్నారు చాలు అంటూ సన్నీ నవ్వుతుంటే.. తాను సీరియస్‌గానే అడుగుతున్నానని, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని ఆమె కోరడం విశేషం. ఇది చూసి.. బిగ్ బాస్ విన్నర్‌గా నిలిస్తే రూ.50 లక్షల ప్రైజ్ మనీ వస్తుందని తెలుసు కానీ, వంద కోట్ల కట్నం కూడా ఇస్తారా అంటూ లైవ్‌లో ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. సదరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on December 29, 2021 3:11 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…