ఒక కొత్త కాంబినేషన్లో ఓ సినిమా సూపర్ హిట్టో, బ్లాక్‌బస్టరో అయ్యిందంటే.. మళ్లీ ఆ కాంబినేషన్లో ఇంకో సినిమా పడి తీరాల్సిందే. అలా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో రామ్ చరణ్-సుకుమార్‌లది ఒకటి. వీళ్లిద్దరూ కలిసి చేసిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్నందుకుందో తెలిసిందే. ఇద్దరి కెరీర్లోనూ ఇది ఏ రకంగా చూసినా బెస్ట్ ఫిలిం అనడంలో సందేహం లేదు. కలెక్షన్ల పరంగా ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాదు.. కల్ట్ స్టేటస్ తెచ్చుకుందీ చిత్రం.
ఈ కలయికలో ఇంకో సినిమా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఐతే ఇందుకోసం ఎంతో సమయం ఎదురు చూడాల్సిన పని లేదు. ఇంకో ఏడాదిలోనే వీరి కలయికలో రెండో సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప’ రిలీజ్ హడావుడిలో ఉన్న సుకుమార్.. దీని తర్వాత ‘పుష్ప-2’ తీయబోతున్నాడు. ఆ చిత్రం వచ్చే ఏడాది ఆఖర్లో రిలీజయ్యే అవకాశాలున్నాయి.ఆ సినిమా ముగించడం ఆలస్యం.. చరణ్‌తో సుక్కు తన తర్వాతి చిత్రం చేయడానికి చూస్తున్నాడు.
ఈ కాంబినేషన్‌లో కొత్త సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. సుకుమార్-రామ్ చరణ్ కలయికలో రానున్న కొత్త చిత్రంలో ఓపెనింగ్ సీన్ గురించి తనకు తెలుసన్నాడు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బెస్ట్ ఓపెనింగ్ సీన్లలో ఒకటిగా ఇది నిలుస్తుందని జక్కన్ తీర్పివ్వడం విశేషం. అసలు ఈ కాంబినేషన్ గురించి ప్రేక్షకులకు అంచనాలే లేదు. దీని గురించి మీడియాలో వార్తలు కూడా రాలేదు. అలాంటిది ‘రంగస్థలం’ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని చెప్పడమే కాక.. అందులో ఓపెనింగ్ సీన్ గురించి జక్కన్న ఇచ్చిన ఎలివేషన్ చరణ్, సుకుమార్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. శంకర్, గౌతమ్ చిత్రాలు రెండూ పూర్తి చేసి సుకుమార్ సినిమాను చరణ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి.
This post was last modified on December 28, 2021 2:24 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…