నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. బాలయ్య ఎప్పుడు స్లంప్‌లో ఉన్నా బోయపాటి వస్తాడు. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తాడు. ఇంతకుముందు సింహా, లెజెండ్ సినిమాలతో అలాగే బాలయ్యను పైకి లేపాడు. ఇప్పుడు యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో తల బొప్పి కట్టించుకున్న బాలయ్యకు మరోసారి బోయపాటి ఉపశమనాన్ని అందించేలాగే ఉన్నాడు.
బుధవారం బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు వీరి కలయికలో రానున్న కొత్త సినిమా టీజర్ వదిలారు. అది ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగానే ఉంది. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఈ టీజర్ కట్ చేశారు. బాలయ్య లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్, మ్యూజిక్.. ఇలా అన్నీ పక్కా కుదిరాయి ఈ టీజర్లో.
ఇందులో బాలయ్య పలికిన డైలాగ్ ఇన్‌స్టంట్ హిట్టయిపోయింది. ఎదుటివాడితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో. శ్రీను గారు మీ నాన్న బాగున్నారా ? అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా? అనడానికి చాలా తేడా ఉంటుందిరా లండీకొడకా.. ఇదీ బాలయ్య పేల్చిన డైలాగ్. అమ్మ మొగుడు అన్న పదం వినగానే బాలయ్య పంచ్ ఎవరికన్నది స్పష్టంగా అర్థమైపోతుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైకాపా నాయకుడు కొడాలి నాని తరచుగా నీ అమ్మా మొగుడు చెప్పాడా అని ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ప్రెస్ మీట్లలోనే కాదు.. అసెంబ్లీలో సైతం ఆయన ఆ మాట వాడాడు. ఒకప్పుడు టీడీపీలో ఉండి.. తర్వాత వైకాపాకు మారి చంద్రబాబు, లోకేష్ సహా తెలుగుదేశం అగ్ర నాయకులపై తీవ్ర స్థాయిలో తిట్లు కురిపిస్తుంటారు నాని. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఈ డైలాగ్‌తో నానికి కౌంటర్ ఇచ్చినట్లున్నాడు.
This post was last modified on June 10, 2020 11:04 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…