యూట్యూబ్‌లో, హిందీ ఛానెళ్లలో రిలీజైన డబ్బింగ్ సినిమాల ద్వారా అల్లు అర్జున్ ఉత్తరాదిన మంచి ఫాలోయింగే సంపాదించాడు కానీ.. అతడి సినిమాను అక్కడి జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తారా అన్న డౌట్లే కలిగాయి పుష్ప రిలీజ్ ముందు అందరికీ. విడుదల ముందు హిందీలో ఈ చిత్రానికి అంతగా హైప్ కూడా కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగానే కనిపించాయి. ఐతే డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్‌లో పుంజుకున్న తీరు అనూహ్యం.
తొలి రోజును మించి తర్వాతి రెండు రోజుల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టడమే కాదు.. వీక్ డేస్‌లో కూడా వీక్ అవ్వకుండా ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. ఐదు రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది పుష్ప హిందీ వెర్షన్. వారం రోజుల్లో పాతిక కోట్ల మార్కునూ దాటింది. ఇప్పుడు రెండో వీకెండ్ అయ్యేసరికి పుష్ప హిందీ వెర్షన్ వసూళ్లు రూ.37 కోట్లకు చేరుకోవడం విశేషం.
క్రిస్మస్ వీకెండ్‌ను ఈ చిత్రం పూర్తిగా ఉపయోగించుకుంది. ఆదివారం ఈ చిత్రానికి హిందీ బెల్ట్‌లో రూ.4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ రావడం విశేషం. రెండో ఆదివారం ఓ సౌత్ డబ్బింగ్ మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం అనూహ్యమే. ఒక దశలో 30 కోట్ల మార్కును అందుకుంటుందన్న అంచనాలు కలగ్గా.. ఇప్పుడు 40 కోట్ల మార్కుకు చేరువగా ఉంది పుష్ప.
ఈ సినిమా రూ.50 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో. నార్త్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల్లో బాహుబలి-2, బాహుబలి-1, సాహో, కేజీఎఫ్ తొలి నాలుగు స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు పుష్ప మూడో స్థానానికి చేరేలా కనిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్-1 హిందీ వెర్షన్ రూ.44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పుష్ప త్వరలోనే దాన్ని అధిగమించేలా కనిపిస్తోంది. 50 కోట్ల మార్కును అందుకోవడం మాత్రం ఈ వారాంతంలో వచ్చే జెర్సీ ఫలితం మీద ఆధార పడి ఉంది.
This post was last modified on December 28, 2021 12:25 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…