సమంత బికినీ ట్రీట్.. గోవాలో అలా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకుంటోన్న ఈ బ్యూటీ త్వరలోనే కమర్షియల్ సినిమాల్లో కూడా అలరించనుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సమంత బికినీ వేసుకొని ఉన్న ఫొటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దానికి ‘గోవా యు బ్యూటీ’ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. 

ఈ ఫొటోని బట్టి అమ్మడు గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి, మోడల్ వాసుకి పుంజ్ కూడా ఉన్నారు. వీరందరూ కలిసి గోవాకి హాలిడేకు వెళ్లారు. చూస్తుంటే న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. తన భర్తతో విడిపోయిన తరువాత సమంత ఎక్కువగా తన స్నేహితులతోనే సమయం గడుపుతోంది. 

గతంలో ఇదే బ్యాచ్ తో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లింది సామ్. తన జీవితంలో వచ్చిన మార్పులను అడ్జస్ట్ చేసుకోవడానికి సమంత తనను తాను చాలా బిజీగా ఉంచుకుంటుంది. హాలిడే ట్రిప్ లు, సినిమాలంటూ గ్యాప్ లేకుండా గడుపుతోంది. రీసెంట్ గానే ‘శాకుంతలం’ సినిమా పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం ‘యశోద’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. 

దీంతో పాటు ఆమె చేతిలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. బాలీవుడ్ లో అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న వెబ్ సిరీస్ లో సమంత కనిపించనుందని సమాచారం. అలానే తాప్సి బ్యానర్ లో ఓ సినిమా చేయబోతుంది. సినిమాల విషయంలో సమంత లైనప్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!