ఇండియాలో లాక్ డౌన్ ఆరంభం కావడానికి ముందు సూపర్ హిట్టయిన సినిమాల్లో అయ్యప్పనుం కోషీయుం ఒకటి. పృథ్వీరాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ మూవీ కేరళలో అదరగొట్టింది. లాక్ డౌన్ టైంలో వివిధ భాషల వాళ్లు అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను విరగబడి చూశారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం బయటికి రావడంతో తెలుగు వాళ్లు మరింతగా ఈ సినిమాపై ఆసక్తి ప్రదర్శించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అయ్యప్పనుం కోషీయుం రీమేక్ హక్కులు కొన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ప్రధాన పాత్రల కోసం నటీనటుల వేట సాగిస్తోంది ఆ సంస్థ. వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. చివరికి ఖరారైంది మాత్రం రవితేజ, రానా అన్నది తాజా సమాచారం.
బిజు మీనన్ చేసిన పవర్ ఫుల్ పోలీస్ పాత్రను రవితేజ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిల్లో ఎక్కువ వెయిట్ ఉన్న పాత్ర అదే. ఇక ఆర్మీలో పని చేసి వచ్చి హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే పెద్దింటి వ్యక్తి పాత్రలో రానా కనిపించనున్నాడు. ఐతే హీరోల పేర్లు ఖరారయ్యాయి కానీ.. ఇంత వరకు ఈ రీమేక్‌కు దర్శకుడెవరన్నది తెలియడం లేదు. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తామని సితార వాళ్లు మీడియాకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రవితేజ-రానా జోడీని తెరపై చూడటం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామి అయ్యే అవకాశముంది. రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీలో నటిస్తుండగా.. రానా విరాట పర్వం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
This post was last modified on June 10, 2020 11:04 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…