ఇండియన్ బాక్సాఫీస్‌లో మళ్లీ క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. గత ఏడాది కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అసలు సందడే లేదు. తెలుగులో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కాస్త సందడి చేసింది. వేరే భాషల్లో ఈ స్థాయి సినిమాలు కూడా లేవు. కానీ ఈ ఏడాది అన్ని ఇండస్ట్రీలు కరోనా ప్రభావం నుంచి బాగానే కోలుకుని క్రిస్మస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలోనే కొత్త చిత్రాలను రిలీజ్ చేశాయి.
తెలుగులో శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి టాకే తెచ్చకుంది. దీనికి వసూళ్లూ బాగున్నాయి. గత వారం వచ్చిన పుష్ప మూవీ క్రిస్మస్ టైంలో బాగానే ప్రభావం చూపుతోంది. హిందీలో 83 మూవీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. మిగతా భాషల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు రిలీజై సందడి చేస్తున్నాయి. ఐతే థియేటర్లలో ఉన్న చిత్రాల కంటే ఓటీటీ సినిమాలు క్రిస్మస్ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుండటం విశేషం.
క్రిస్మస్ కానుకగా అత్రంగి రే అనే హిందీ మూవీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్, సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన చిత్రమిది. కాంబినేషన్ క్రేజ్‌కు తోడుట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన అత్రంగిరేకు టాక్ కూడా అదిరిపోయింది. జీరో సినిమాతో నిరాశ పరిచిన ఆనంద్.. ఈ సినిమాతో బాగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ధనుష్ మరోసారి బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు. సినిమా అదిరిందని, అతడి పెర్ఫామెన్స్ సూపరని అందరూ కొనియాడుతున్నారు. సారాకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయగా హాట్ స్టార్‌కు భారీగా వ్యూయర్ షిప్ తెస్తోందట ఈ చిత్రం.
ఇక మలయాళంలో తెరకెక్కి దాంతో పాటుతెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన నెట్ ఫ్లిక్స్ మూవీ మిన్నల్ మురళికి దీనికి మంచి టాక్ వచ్చింది. ఈ ఏడాది బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. టొవినో థామస్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.
మరోవైపు తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ మానాడు.. క్రిస్మస్ కానుకగా సోనీ లివ్‌లో రిలీజైంది. దీన్ని తెలుగు, హిందీ, కన్నడల్లోనూ రిలీజ్ చేశారు. దీనికీ స్పందన బాగుంది. ఐతే థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఇందులోనే రిలీజైన తెలుగు మూవీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకు మాత్రం బ్యాడ్ టాక్ వచ్చింది. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ప్రధాన పాత్రలో నటించిన రెండో చిత్రమిది. 118 దర్శకుడు గుహన్ ఈసారి తీవ్ర నిరాశకు గురి చేశాడంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
This post was last modified on December 26, 2021 10:01 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…