హీరోయిన్లు బాగా ఇబ్బంది పడే సన్నివేశాల్లో ముందు వరుసలో ఉండేవి ఇంటిమేట్, బోల్డ్ సీన్లు. ఆ తర్వాత సిగరెట్ తాగడం, మందు కొట్టడం లాంటి సన్నివేశాలే. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఈ రెండు సీన్లూ చేసి ఆశ్చర్యపరిచింది యువ కథానాయిక కృతి శెట్టి. తొలి చిత్రం ఉప్పెనలో పల్లెటూరి అమ్మాయిగా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కృతి.. రెండో చిత్రానికి పూర్తిగా అవతారం మార్చేసింది.
మోడర్న్ అమ్మాయిగా కనిపించింది. శ్యామ్ సింగరాయ్‌లో ఆమె చేసిన కీర్తి అనే మోడర్న్ సిటీ అమ్మాయిగా కనిపించింది కృతి. ఇందులో ఆమె నానితో కలిసి లిప్ లాక్, బోల్డ్ సీన్స్ చేయడంతో పాటు సిగరెట్ తాగే సన్నివేశాల్లోనూ నటించింది. ఐతే బోల్డ్ సీన్స్ కంటే కూడా సిగరెట్ తాగే సన్నివేశంలోనే తాను ఎక్కువ ఇబ్బంది పడ్డట్లు కృతి వెల్లడించింది. బేసిగ్గా తనకు సిగరెట్ తాగే వాళ్లంటే అస్సలు పడదని, వాళ్లకు చాలా దూరంగా ఉంటానని కృతి చెప్పింది.
అలాంటిది తెరమీద సిగరెట్ తాగే అమ్మాయిగా నటించడం ఏంటి అనిపించిందని.. ఇదే మాట దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో అంటే.. మరి వ్యక్తిగా కృతికి, నటిగా కీర్తికి తేడా చూపించాలి కదా అని తనతో చెప్పి ఈ సన్నివేశం చేయడానికి ఒప్పించాడని.. తాను ఇబ్బంది పడకుండా ఆరోగ్య సేతు సిగరెట్లు తెప్పించాడని.. అవి పాల రుచితో ఉంటాయని.. అయినప్పటికీ తాను సిగరెట్ తాగే సీన్లలో ఇబ్బంది పడుతూనే చేశానని.. ఆ సన్నివేశం చేస్తున్నపుడు తనకు వణుకొచ్చిందని కృతి చెప్పింది.
ఇక బోల్డ్ సీన్ల గురించి వివరిస్తూ.. ఇలాంటివి చేసేటపుడు తాము నటనలో భాగంగానే, పాత్ర కోసమే చేస్తున్నామన్న ఆలోచనే ఉంటుందని, కథ డిమాండ్ చేస్తే అలాంటివి చేయడంలో తప్పేమీ లేదని.. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నానీతో ఆ సీన్లు చేసేటపుడు తాను ఇబ్బంది పడలేదని కృతి వెల్లడించింది.
This post was last modified on December 25, 2021 8:25 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…