క్రిస్మస్ కానుకగా ఇండియాలో రిలీజైన అతి పెద్ద సినిమా అంటే.. 83నే. భారత క్రికెట్ చరిత్రలో అతి పెద్ద మలుపు అయిన 1983 వన్డే ప్రపంచకప్ విజయం నేపథ్యంలో, అందులో ప్రధానంగా కెప్టెన్ కపిల్ దేవ్ హీరోయిక్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఏడాది కిందటే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కోసమనే ఆపి ఉంచారు. ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేసి ఎట్టకేలకు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ రూపొందించగా.. తెలుగువాడైన విష్ణువర్ధన్ ఇందూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు.
ఐతే ఈ సినిమా రిలీజ్ రోజు ఉదయం నుంచి ట్విట్టర్లో #boycott83 అనే హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండటం గమనార్హం. అంతకంతకూ దీని మీద ట్వీట్లు బాగా పెరిగి సాయంత్ర సమయానికి ఈ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అయింది. నిజానికి 83 సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎం.ఎస్.ధోని తరహాలోనే అథెంటిక్ క్రికెట్ మూవీ అని.. ఒక క్లాసిక్ లాగా దీన్ని కబీర్ ఖాన్ తీర్చిదిద్దాడని ప్రశంసలు దక్కాయి.
నరేషన్ కొంచెం స్లో, కపిల్ వ్యక్తిగత జీవితాన్నేమీ చూపించలేదు అన్న కంప్లైంట్స్ మినహాయిస్తే అన్ని వైపులా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. ఇందులో వివాదాస్పద అంశాలేమీ లేవు. అలాంటపుడు ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అన్నది ప్రశ్నార్థకం. ఈ పని చేస్తున్నది సుశాంత్ రాజ్ పుత్ అభిమానులు కావడం గమనార్హం.
సుశాంత్ మరణానికి సంబంధించి అతడి అభిమానుల సందేహాలకు సమాధానాలు లభించకపోవడం.. బాలీవుడ్లో టాప్ స్టార్స్ మాఫియా వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే అభిప్రాయంతో వాళ్లుండటంతో.. ఇలా ఏ పెద్ద సినిమా రిలీజైనా నెగెటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు సైతం ఈ సెగ తప్పలేదు. ఇప్పుడు దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌ల మీద కోపంతో 83 సినిమాకు వ్యతిరేకంగా ఇలా హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. మరి ఈ ప్రభావం సినిమాపై ఎంతమేర పడుతుందో చూడాలి.
This post was last modified on December 25, 2021 1:13 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…