Movie News

కాస్త త‌గ్గించుకోండి.. నేతలకు సిద్దార్థ్ కౌంటర్

ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం రోజురోజుకు హాట్‌ టాపిక్‌గా మారుతోంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌‘ మీడియా సమావేశంలో నటుడు నాని ఏపీలో సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై అసహనం వ్యక్తం చేశారు. ‘రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనికి మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ, కుర‌సాల క‌న్న‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు. పేద‌ల‌ను ఆదుకునేందు కు మాత్ర‌మే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. అయితే.. మంత్రులకు ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు న‌టుడు సిద్ధార్థ‌. టికెట్ల ధరలు తగ్గించడంపై సిద్ధార్థ్‌ సెటైర్లు వేశాడు. ‘‘సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్‌ అందిస్తున్నామని మంత్రులు అంటున్నారు. మరి మేం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంతమంది విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు కాజేస్తున్నారు.

మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్‌ ఇవ్వండి’’ అంటూ ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌లో సిద్ధార్థ్‌ ఎవరి గురించి అంటున్నది చెప్పలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రమే టికెట్‌ రేట్ల సమస్య నడుస్తోం ది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ మాటలు ఏపీ మంత్రులను ఉద్దేశించి చేసినవే అని నెటిజన్లు చర్చించు కుంటు న్నా రు.

అయితే.. ఈ వివాదం మ‌రోసారి ముదురుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త అక్టోబ‌రులో ర‌గిలిన వివాదం.. అప్ప‌ట్లో స‌మ‌సిపోయింద‌ని.. అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా మ‌రోసారి.. ఇదివివాదంగా మారింది. ఇప్పుడు స‌ర్కారు.. వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని.. చెబుతుండ‌గా.. అటు టాలీవుడ్ నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎటు దారితీస్తుందో.. ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

This post was last modified on December 24, 2021 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

21 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

59 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago