అక్కినేని తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా ‘బంగార్రాజు’. వీళ్లిద్దరూ కలిసి ఇంతకుముందు చేసిన ‘మనం’ ఎంత పెద్ద విజయం సాధించిందో.. ఎలా కల్ట్ స్టేటస్ తెచ్చుకుందో తెలిసిందే. తండ్రీ కొడుకులు మరోసారి కలిసి నటిస్తుండటం.. పైగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్‌బస్టర్‌కు ఇది ప్రీక్వెల్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల కొన్నేళ్ల పాటు కష్టపడి స్క్రిప్టు సిద్ధం చేస్తే.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు నాగార్జున.
తన సొంత బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఆయనీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బంగార్రాజు’ సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పాటలు, ఇతర ప్రోమోలు ఆకట్టుకున్నాయి. కాకపోతే అక్కినేని అభిమానులకు ఒక్క విషయంలో మాత్రం కాస్త టెన్షన్‌గా ఉంది.‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జునను మించి నాగచైతన్య పాత్ర ఉంటుందని అంటున్నారు.
కథ ప్రధానంగా నడిచేది ఈ పాత్ర చుట్టూనేనట. ఈ పాత్రకు జోడీగా కృతి శెట్టిన పెట్టారు. సినిమాకు సంబంధించిన అన్ని ప్రోమోల్లోనూ చైతూనే హైలైట్ అవుతున్నాడు. నాగ్ బ్యాక్ సీట్ తీసుకుంటున్నాడు. ఐతే జూనియర్ బంగార్రాజు పాత్రలో కనిపించనున్న చైతూ.. నాగ్ లాగా రొమాన్స్ పండించగలడా.. ఎంటర్టైన్ చేయగలడా అన్నదే ఇప్పుడు అభిమానుల్లో కలుగుతున్న సందేహం. చైతూ బేసిగ్గా సీరియస్ పాత్రలకు బాగా సూటవుతాడు.
అతడి యాక్టింగ్ కూడా ఈ పాత్రలకే బాగా సరిపోతుంది. కామెడీలో అతను కొంచెం వీక్. రొమాన్స్‌లోె కూడా తండ్రి లాగా సత్తా చాటుకున్నది లేదు. బంగార్రాజు పాత్రంటేనే రొమాన్స్‌కు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా తీర్చిదిద్దారు ‘సోగ్గాడే..’లో. ఆ పాత్రతో ఎంటర్టైన్మెంట్ కూడా బాగా పండించారు. నాగ్ అంటేనే చాలా రొమాంటిక్ అనే ఫీలింగ్ జనాల్లో ఉండటం వల్ల.. ఆయన తనకు పట్టుున్న రసాన్ని బాగా పండించడం వల్ల ఆ పాత్ర బాగా హైలైట్ అయింది. కానీ రొమాన్స్, కామెడీలో వీక్ అయిన చైతూ ఈ పాత్రలో ఏమేర రాణిస్తాడో.. మెప్పిస్తాడో అన్నది కొంచెం సందేహంగానే ఉంది.
This post was last modified on December 24, 2021 5:00 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…