దర్శకులు నటులు కావడం తరచుగా చూస్తుంటాం కానీ.. నటులు దర్శకులు కావడం అరుదే. అందులోనూ హీరోగా నటించిన వాళ్లు దర్శకులు కావడం మరీ తక్కువ. ‘ప్రేమ గీతం’, ‘జ్ఞాపకం’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి దర్శకుడు అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే అతను మెగా ఫోన్ పట్టి తీసిన తొలి చిత్రం ‘తొలి ప్రేమ’తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఈ కుర్రాడిలో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అనిపించాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ తర్వాత అతను తీసిన ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దె’ సినిమాల్లోనూ తన దర్శకత్వ ప్రతిభ కనిపించింది కానీ.. అవి పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ రెండు చిత్రాల్లో ఇబ్బంది పెట్టేది ద్వితీయార్ధమే. తన తొలి చిత్రం ‘తొలి ప్రేమ’లోనూ సెకండాఫ్ వీక్‌గానే ఉంటుంది.
ప్రథమార్ధం వరకు కథను ఇండియాలో నడపడం.. ద్వితీయార్ధానికి ఫారిన్‌కు షిఫ్ట్ అయిపోవడం వెంకీ స్టయిల్. మూడు చిత్రాల్లోనూ అదే జరిగింది. కానీ ఆ ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే తంతే అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో వెంకీ మీద ఒక ముద్ర పడిపోయింది. అతను సెకండాఫ్‌ను లోకల్‌గా నడపలేడని.. ఫారిన్‌కు వెళ్లిపోతాడని.. అక్కడే అతడి వీక్‌నెస్ ఉందని కామెంట్లు చేస్తుంటారు. ఐతే ఇప్పుడు వెంకీ తన తొలి మూడు చిత్రాలకు భిన్నమైన కథతో ధనుష్ హీరోగా ‘సార్’ పేరుతో తమిళం, తెలుగులో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ వీడియో చూశాక ఇదొక సీరియస్ మూవీ అనిపిస్తోంది. విద్యా వ్యవస్థ చుట్టూ సమస్యల కోణంలో నడిచే సినిమాలా కనిపిస్తోందిది. టైటిల్ మోషన్ పోస్టర్లో ఇంటెన్సిటీ కనిపించింది. ఐతే వెంకీ తొలి మూడు చిత్రాల అనుభవంతో అతడి మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాలో అయినా సెకండాఫ్‌ను లోకల్‌గా నడిపిస్తాడా.. లేక ఈ ‘సార్’ను కూడా ఫారిన్‌కు పట్టుకుపోయి సినిమాను చెడగొడతాడా అని కౌంటర్లు వేస్తున్నారు. మరి వెంకీ స్టైల్ మార్చి ఈసారైనా పూర్తి స్థాయిలో మెప్పిస్తాడేమో చూడాలి.
This post was last modified on December 23, 2021 6:30 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…