Movie News

అల వైకుంఠపురం రీమేక్.. టబు వార్నింగ్

నటిగా టబుది ఓ డిఫరెంట్ జర్నీ. ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి కమర్షియల్ హిట్ చిత్రాల్లో నటించింది. ‘చాందినీబార్‌‌’లాంటి సీరియస్‌ కాన్సెప్టులతోనూ మెప్పించింది. ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకుంది. కెరీర్ మొదట్నుంచీ కూడా ఏది పడితే అది చేసేయకుండా ఓ ప్రత్యేకతను చూపించుకుంటూ వచ్చింది. ఇప్పటికీ అదే తీరు. అందుకే తనపై అందరికీ ఓ స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది.      

చాలా గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురములో’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది టబు. రిచ్ ఉమన్‌గా.. భర్త చేసిన మోసంతో తనలో తనే రగిలిపోయే భార్యగా.. కొడుకే ప్రపంచం అనుకునే తల్లిగా.. అన్ని రకాల ఎమోషన్స్‌ని తనదైన శైలిలో పండించి వహ్వా అనిపించింది. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఆ టీమ్‌కి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది టబు.       కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘షెహ్‌జాదా’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది ‘అల వైకుంఠపురములో’.

దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌ గిల్ నిర్మిస్తున్నారు. కృతీ సనన్ హీరోయిన్. షూటింగ్ జోరుగా సాగుతోంది. లొకేషన్‌లో డైరెక్టర్‌‌తో దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కార్తీక్. అది చూసిన టబు.. ‘జాగ్రత్తగా రీమేక్ చేయండి.. అది నా సినిమా’ అని కామెంట్ చేసింది. దానికి ఆర్యన్ కూడా రియాక్టయ్యాడు. ‘మీ సినిమా కనుకనే మరింత ప్రేమతో తీస్తున్నాం’ అని జవాబిచ్చాడు.       

అల వైకుంఠపురములో బన్నీ కెరీర్‌‌లోనే ఓ స్పెషల్ మూవీ. ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. రికార్డులు బద్దలు కొట్టింది. ముఖ్యంగా పాటలు, వాటిలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు అదరగొట్టాయి. అలాంటి సినిమాని రీమేక్ చేస్తున్నారంటే అందరి దృష్టీ ఉండటం కామన్. అయితే టబు పాత్రని హిందీలో కూడా ఆమే చేసివుంటే బాగుండేదని చాలామంది ఫీలవుతున్నారు. కానీ చేసిన పాత్రే మళ్లీ చేయడానికి ఆమె ఒప్పుకోలేదట. దాంతో మనీషా కొయిరాలాని తీసుకున్నారు. ఆమె కూడా మంచి నటే కానీ టబు ఉంటే ఆ హుందాతనమే వేరు అనేది ఎక్కువమంది ఫీలింగ్. 

This post was last modified on December 22, 2021 6:05 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

46 minutes ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

2 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

3 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago