‘పుష్ఫ’… ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తాడనే విషయం ఇంకా కన్ఫార్మ్ కాకముందే, ఈ ప్రాజెక్ట్‌లో మరో బాలీవుడ్ స్టార్ ఆడిపాడనుందని టాక్ వినిపిస్తోంది.
సుకుమార్, బన్నీ కాంబో అంటే ఐటెమ్ సాంగ్ తప్పనిసరి. ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. దాంతో ‘పుష్ప’లో కూడా అదిరిపోయే ఓ ఐటెమ్ సాంగ్ ఉండాలని ఫిక్స్ అయ్యారట సుక్కూ అండ్ బన్నీ.
ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాను సంప్రదిస్తున్నట్టు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ 4’ సినిమాలతో బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఊర్వశి, సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది.
బికినీ ఫోజులు, హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఊర్వశి, బన్నీ పక్కన ఐటెం సాంగ్ చేస్తే మాస్ ఏరియాల్లో మోత మోగిపోవడం గ్యారెంటీ. అయితే ఊర్వశి కంటే ముందు ఈ ఐటెమ్ సాంగ్ కోసం కియారా అద్వానీని సంప్రదించారట. ‘వినయవిధేయ రామ’ తర్వాత తెలుగులో కనిపించని కియారా, బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ యమా బిజీగా ఉంది.
ఈ ఏడాది నాలుగు సినిమాల్లో నటిస్తున్న కియారా, తెలుగులో ఐటెమ్ సాంగ్‌కి నో చెప్పడంతో ఆ ప్లేస్‌లోకి ఊర్వశి వచ్చిందని టాక్. ఒక్క పోస్టర్‌తోనే ఇన్ని రకాల వార్తలు పుట్టుకొస్తే, మున్ముందు ‘పుష్ఫ’ గురించి ఎన్ని వార్తలు వినాల్సి వస్తుందో మరి!!
This post was last modified on April 17, 2020 5:34 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…