నాలుగు రోజుల కిందట భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అతడికి ఆల్రెడీ కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన పాత సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపే సంపాదించాడు. కర్ణాటకలో మిగతా తెలుగు స్టార్ల లాగే అతడికి ఫాలోయింగ్ ఉంది.
తమిళంలోనూ ఓ మోస్తరు గుర్తింపే ఉండటంతో ధైర్యం చేసి ‘పుష్ప’ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఐతే బన్నీకి తెలుగు రాష్ట్రాల అవతల ఉన్న ఫాలోయింగ్ కలెక్షన్ల రూపంలో ప్రతిఫలిస్తుందా లేదా అన్న అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి.
రిలీజ్ ముంగిట సరైన ప్రమోషన్లు లేకపోవడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పట్ల ఏమాత్రం ఆసక్తి ఉంటుందో అన్న డౌట్లు కూడా కొట్టాయి. కానీ ‘పుష్ప’ తెలుగు రాష్ట్రాల అవతల అంచనాల్ని మించి ఆడేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సోమవారం ‘పుష్ప’ హిందీ వెర్షన్ నాలుగున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. శుక్రవారం డల్ నోట్‌తో మొదలైన ‘పుష్ఫ’ హిందీ వెర్షన్ రెండో రోజు బలంగా పుంజుకుంది. శని, ఆదివారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. సోమవారం కూడా ‘పుష్ఫ’ హిందీ వెర్షన్ జోరు తగ్గలేదు. దాదాపు నాలుగున్నర కోట్ల గ్రాస్ వచ్చిందట.
శనివారం కంటే సోమవారం వసూళ్లు ఎక్కువ ఉండటం గమనార్హం. ఇప్పటిదాకా ‘పుష్ఫ’ రూ.16 కోట్ల గ్రాస్ రాబట్టింది హిందీ బెల్ట్‌లో. అక్కడ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.25 కోట్లకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ‘పుష్ఫ’ మలయాళ వెర్షన్ తొలి రోజు నుంచి అదరగొడుతోంది.
రిలీజ్ కొంచెం ఆలస్యమైనప్పటికీ.. వసూళ్లపై ప్రభావం పడలేదు. తొలి నాలుగు రోజుల్లో ప్రతి రోజూ రూ.కోటికి పైగానే కలెక్షన్ రాబట్టి రూ.5 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా నిలిచింది. చిన్న రాష్ట్రమైన కేరళలో ఇవి మెరుగైన వసూళ్లే. ఆశ్చర్యకరంగా తమిళనాట ‘పుష్ప’ ఇదే స్థాయిలో ప్రభావం చూపుతోంది.
అక్కడ వీకెండ్ అంతా మేజర్ సిటీస్‌లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయింది ‘పుష్ప’. అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్క కర్ణాటకలో మాత్రమే తెలుగు వెర్షన్ గట్టి ప్రభావం చూపుతుండగా.. కన్నడ వెర్షన్‌కు అంతగా స్పందన లేదు. పరిస్థితి చూస్తుంటే ఇంటి సంగతేమో కానీ.. బన్నీ రచ్చ గెలిచినట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 21, 2021 10:01 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…