బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. పన్నులు ఎగ్గొట్టడానికి దీవుల్లో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈడీ కేసును నమోదు చేసింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు హాజరు కావాలని ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది. నిజానికి ఇంతకుముందే ఐశ్వర్యరాయ్ ను ఈడీ ఆఫీస్ కు రావాలని కోరారు.
కానీ ఆమె ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది. ఈసారి మాత్రం ఆమె తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఆమెని విచారించనుంది ఈడీ. దీనిపై ఐశ్వర్యరాయ్ ఇప్పటివరకు స్పందించలేదు. నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్ కొన్ని పత్రాలను అందజేశారు.
ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఇలా సొసైటీలో పేరున్న చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇంతకీ ఈ పనామా పేపర్స్ ఏంటంటే.. కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఇతర దేశాల బ్యాంకుల్లో తమ నగదును దాచుకున్నారు. ఆ విధంగా స్వదేశానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారు. ఈ విషయం పనామా పేపర్స్ నుంచి లీక్ అవ్వడంతో విషయం బయటపడింది. దీంతో ఇప్పుడు అధికారులు పన్నులు ఎగ్గొట్టిన వారిపై దృష్టి పెట్టారు.
This post was last modified on December 20, 2021 1:29 pm
సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమల్ హాసన్ ని పొట్టివాడిగా మార్చి విచిత్ర సోదరులు…
తెలుగు సినీ పరిశ్రమను అమరావతి రాజధానికి తీసుకు వస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణం పూర్తయితే.. అన్ని రంగాల…
ఏపీ సీఎం చంద్రబాబు.. 2025 నూతన సంవత్సరం తొలిరోజు చాలా చాలా బిజీగా గడిపారు. అయితే.. సహజంగానే తొలి సంవత్స…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ప్రారంభానికి జనవరి 2 ఎంచుకోవడం హాట్ టాపిక్…
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ గత ఏడాది అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ…
క్రిస్మస్ రిలీజ్ వదులుకున్నందుకు రాబిన్ హుడ్ విషయంలో నితిన్ బాగా అసహనంతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. వెంకీ కుడుముల…