‘పుష్ప’ సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అల్లు అర్జున్ పేరు చెప్పేస్తారు అందరూ. వన్ మ్యాన్ షో అనిపించేలా మొత్తం సినిమాను తన భుజాల మీద మోశాడు బన్నీ. పెర్ఫామెన్స్ విషయంలో ఎవరూ అతడి ముందు నిలవలేకపోయారు. హీరోయిన్ రష్మిక గురించి ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి. మెయిన్ విలన్‌గా చేసిన సునీల్ గెటప్ అదీ బాగున్నా.. మంగళం శీను పాత్ర అనుకున్నంత గొప్పగా ఏమీ లేదు. సునీల్ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయాడు.
అనసూయ చేసిన ద్రాక్షాయని పాత్ర తేలిపోయింది. కొండా రెడ్డిగా అజయ్ ఘోష్ మంచి మార్కులే వేయించుకున్నాడు. జాలి రెడ్డిగా కన్నడ నటుడు ధనంజయ పర్వాలేదనిపించాడు. ఐతే వీళ్లందరినీ మించి.. అల్లు అర్జున్ తర్వాత నటన పరంగా మంచి ఇంపాక్ట్ వేసిన ఒక నటుడున్నాడు. అతడి పేరు.. జగదీష్.
సినిమా అంతటా హీరో పక్కనే ఉండే కేశవ అనే పాత్రలో నటించిన నటుడే జగదీష్. చాలామందికి ఇతనెవరో కూడా తెలియదు. ఎవరో కొత్త ఆర్టిస్ట్ అనుకుంటున్నారు. కానీ అతను ఇప్పటికే ఓ సినిమాలో మంచి పాత్ర చేశాడు. ఆ చిత్రమే.. పలాస. అందులో హీరోయిన్ అన్న పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా చూసే సుకుమార్ ‘పుష్ప’లో హీరో ఫ్రెండు పాత్రకు జగదీష్‌ను ఎంచుకున్నాడు.
ఐతే తొలి సినిమాలో శ్రీకాకుళం యాసలో ఆకట్టుకున్న జగదీష్‌కు దానికి పూర్తి భిన్నమైన చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పడం కష్టమే అయ్యుంటుంది. ఐతే అతను ఎంత కష్టపడ్డాడో ఏమో కానీ.. చాలా ఈజ్‌తో చిత్తూరు యాసలో సంభాషణలు చక్కగా పలికాడు. ఇక అతడి నటన కూడా గొప్పగా సాగింది. అల్లు అర్జున్ అయినా అక్కడక్కడా కొంచెం కృత్రిమంగా చేసినట్లు, పట్టి పట్టి డైలాగులు చెబుతున్నట్లు అనిపించింది కానీ.. జగదీష్ అయితే ఆ పాత్రలో చాలా ఈజీగా ఒదిగిపోయాడు. సుకుమార్ సినిమా చూసి అతణ్ని ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ఈ నటుడు బిజీ అయ్యేలా ఉన్నాడు.
This post was last modified on December 19, 2021 7:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…