మహానటి తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టినా.. కమర్షియల్ సినిమాలకు కూడా ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్‌గానే ఉంది కీర్తి సురేష్. నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన కూడా మెరిసి మురిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ దూకుడు చూపిస్తోంది.
త్వరలో ఓ తమిళ స్టార్ హీరోతో కలిసి ఆమె నటించబోతోందనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. విజయ్. ప్రస్తుతం బీస్ట్ చిత్రంలో నటిస్తున్న విజయ్.. తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కీర్తిని తీసుకున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఎట్టకేలకి దీనిపై విజయ్ టీమ్ రియాక్టయ్యింది. కీర్తిని హీరోయిన్‌గా తీసుకోవడం నిజం కాదని, ఇంకా హీరోయిన్ కన్‌ఫర్మ్ కాలేదని, కాగానే చెబుతామని క్లారిటీ ఇచ్చింది. దాంతో పుకార్లకి ఫుల్‌స్టాప్ పడింది. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా కాలమైంది. కానీ ఇంతవరకు కాస్ల్ అండ్ క్రూ గురించి ఎటువంటి ప్రకటనా లేదు. అందుకే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయి.
అయినా విజయ్ సరసన కీర్తి నటించడమనేది ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ విషయమో అరుదైన విషయమో కాదు. ఎందుకంటే వీళ్లిద్దరూ మొదటిసారి జోడీ కట్టడం లేదు. ఆల్రెడీ సర్కార్ మూవీలో కలిసి నటించారు. కాబట్టి ఒకవేళ ఈ వార్త నిజమై ఉంటే కాంబో రిపీట్ అయ్యుండేదంతే. కాదని ఇప్పుడు తేలిపోయింది కనుక ఆ ప్లేస్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.
This post was last modified on December 18, 2021 4:10 pm
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…