సమంత.. మరీ ఈ రేంజిలోనా?

గత రెండు వారాల నుంచి తెలుగు సినీ ప్రేక్షకుల చర్చల్లో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటున్న పేరు సమంతదే. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ చేయనిది ఇప్పుడామె చేసింది. ‘పుష్ప’ సినిమాలో ఆమె ‘ఊ అంటావా మావా’ అంటూ సాగే ఐటెం సాంగ్ చేయడం తెలిసిందే. ఈ పాటకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడే జనాలు ఆశ్చర్యపోయారు. అంత సెక్సీగా కనిపించిందా పోస్టర్. ఇక పాట రిలీజై అందులో లిరిక్స్ చూశాక వామ్మో అనుకున్నారు.

చాలా శృంగారభరితంగా, మగాళ్ల బుద్ధి వంకర అంటూ సాగిన లిరిక్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఇక ఈ పాటకు సంబంధించి చిన్న ప్రోమో టీజర్ వదిలితే అందులో సమంత హాట్ స్టెప్స్ ఇంకా ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక సినిమాలో ఈ పాట చూసిన వాళ్లు.. సమంత అప్పీయరెన్స్ విషయంలో ముక్కున వేలేసుకుంటున్నారు.

సమంత హాట్‌గా కనిపిస్తుందనుకున్నారు కానీ.. మరీ అంత హాట్ అని ఎవ్వరూ అనుకోలేదు. కెరీర్లో ఎప్పుడూ చేయనంత స్థాయిలో ఎక్స్‌పోజింగ్ చేసింది సమంత. ఆ స్థాయిలో క్లీవేజ్ షో చేయడం షాకింగే. గతంలో కాజల్, తమన్నా, శ్రుతి హాసన్.. ఇలా చాలామంది స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేశారు కానీ.. వాళ్లెవ్వరూ కూడా ఈ రేంజిలో అందాలను ఆరబోయలేదు. మామూలుగా ఐటెం భామలుగా పేరున్నవాళ్లు మాత్రమే ఈ స్థాయిలో రెచ్చిపోతుంటారు. వాళ్లకది పెద్ద విషయంలానూ కనిపించదు. కానీ సమంత వాళ్ల మాదిరే అంత సెక్సీగా, హాట్‌గా కనిపించడం.. క్లీవేజ్ అందాల ప్రదర్శన చేయడం అందరికీ షాకింగ్‌‌గా ఉంది. ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.