అల్లు అర్జున్ మంచి పెర్ఫామర్ అన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సరైన పాత్ర పడితే అతను ఎలా రెచ్చిపోతాడో.. ఆ పాత్రను తన ఇమేజ్ పెంచుకోవడానికి ఎలా ఉపయోగించుకుంటాడో.. అలాగే ఆ పాత్రకు ఎలా వన్నె తెస్తాడో చెప్పడానికి చాలా రుజువులే ఉన్నాయి. చివరగా ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బన్నీ ఎలా అదరగొట్టాడో తెలిసిందే. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా సరికొత్త అవతారంలోకి మారి ‘పుష్ఫ’ చేశాడతను.
ఈ సినిమా ప్రోమోల్లోనే బన్నీని చూసి అందరూ ఔరా అనుకున్నారు. ఇప్పుడు సినిమా చూసి అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట.. ‘పుష్ఫ’లో బన్నీది వన్ మ్యాన్ షో అని. ‘పుష్ప’లో దర్శకుడు సుకుమార్ సహా మెయిన్ కాస్ట్ అండ్ క్రూలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవడం మొదలుపెడితే పాజిటివ్స్‌తో పాటు నెగెటివ్స్ కూడా కనిపిస్తాయి. కానీ బన్నీ విషయంలో మాత్రం వెతకడానికి ఏ లోపమూ కనిపించదంటే అతిశయోక్తి కాదు.
నటీనటులు, టెక్నీషియన్స్ అందరినీ పక్కకు తోసేసి.. సినిమా మొత్తాన్ని తనే ఆక్రమించేశాడు బన్నీ. ఇంట్రో సీన్‌తో మొదలుపెడితే.. ఎండ్ కార్డ్ పడే వరకు బన్నీ ఎక్కడా ‘తగ్గేదేలే’ అనిపించాడు. సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా.. బన్నీ మాత్రం ప్రతి సన్నివేశంలోనూ తన అభిమానులకు ఒక హై ఇచ్చాడు. పుష్ప పాత్రలో తనకు మించి ఇంకెవరూ పెర్ఫామ్ చేయలేరు అనే భావన కలిగించాడు. అసలు అలాంటి మేకోవర్ ఇంకెవరికైనా సాధ్యమా అనిపిస్తుంది కూడా. చిత్తూరు యాస మీద అతను సాధించిన పట్టు.. సంభాషణలు పలికిన విధానం ఆశ్చర్యపరిచేదే. క్యారెక్టర్ పరంగా కూడా పుష్ప ఎక్కడా తగ్గకపోవడంతో బన్నీకి తిరుగులేకపోయింది.
కానీ బన్నీ ఆధిపత్యమే సినిమాకు మైనస్ కూడా అయింది. కథ మొత్తం హీరో చుట్టూనే తిరగడం.. విలన్ పాత్రలు, మిగతావి వీక్ అయిపోవడం.. సుకుమార్ తన ఫోకస్ అంతా హీరో క్యారెక్టర్ మీదే పెట్టడంతో మిగతా పాత్రలు, అంశాలు అనుకున్నంతగా పండలేదు. దీని వల్ల సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.
This post was last modified on December 17, 2021 4:14 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…