Movie News

అలా కాకుంటే షర్టు విప్పేసి తిరుగుతా-బన్నీ

దర్శకుడు సుకుమార్‌తో అల్లు అర్జున్‌‌కు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా ‘గంగోత్రి’ ఉన్నంతలో బాగానే ఆడినా.. ఆ సినిమాతో బన్నీకి నెగెటివ్ రిమార్క్సే పడ్డాయి. ఐతే ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘ఆర్య’తో అతడి కెరీర్ మారిపోయింది. ఆ చిత్రంతో స్టార్ అయిపోయాడు బన్నీ. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ‘ఆర్య’ ఎప్పటికీ బన్నీకి స్పెషల్. అలాగే తాను పని చేసిన దర్శకులందరిలో సుకుమార్ అతడికి చాలా ప్రత్యేకం. సుక్కు గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతాడు. అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తాడు.

ఇప్పుడు ‘పుష్ప’ రిలీజ్ ముంగిట సుక్కుతో కలిసి పాల్గొన్న ప్రెస్ మీట్లోనూ తన ఫేవరెట్ డైరెక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు బన్నీ. ‘పుష్ఫ’ సినిమాను సుక్కు తీసిన విధానం చూసి తాను షాకైపోయినట్లుగా బన్నీ వెల్లడించాడు. ఈ సందర్భంగా బన్నీ ఒక ఆసక్తికర ఛాలెంజ్ కూడా చేయడం విశేషం.

‘‘పుష్ప సినిమాను ఒక హీరోగా కాకుండా ఒక ప్రేక్షకుడిలా చూసి చెబుతున్నా. సుకుమార్ గారు ఈ సినిమాను మామూలుగా తీయలేదు. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా తీయొచ్చా అనిపించారు సుక్కు. రేప్పొద్దున థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నపుడు వారికి పిచ్చెక్కిపోతుంది. మేం అనుకున్నట్లుగా మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా లెవెలే వేరుగా ఉంటుంది.

కచ్చితంగా చెబుతున్నా.. ఈ సినిమా రిలీజయ్యాక దర్శకులంతా సుకుమార్ గారి దగ్గరికి వచ్చి ఇలా ఎలా తీశారు సార్ సినిమా అని అడుగుతారు. ఈ విషయంలో ఆయన దగ్గర క్లాసులు తీసుకుంటారు. ప్రతి సీన్ గురించి మాట్లాడతారు. ఆ సీన్లు ఎలా తీశారో అడిగి తెలుసుకుంటారు. అంత బాగా తీశారాయన ఈ సినిమా. ఇలా జరక్కపోతే నేను షర్ట్ విప్పేసి మైత్రీ ఆఫీసులో తిరుగుతా’’ అంటూ నవ్వేశాడు బన్నీ. మరి ఈ అల్లు హీరో చెబుతున్న రేంజిలో ‘పుష్ఫ’లో సుక్కు ఏం మ్యాజిక్ చేశాడో చూడాలి.

This post was last modified on December 17, 2021 6:52 am

Share

Recent Posts

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

5 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

33 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

1 hour ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

6 hours ago