టాలీవుడ్లో నిన్నటితరం హీరోల్లో రాజశేఖర్, విక్టరీ వెంకటేష్ ఎక్కువగా రీమేక్‌లు చేసేవాళ్లు. ఇప్పటికీ వాళ్లిద్దరూ వేరే భాషల్లో హిట్టయిన చిత్రాల ఆధారంగా సినిమాలు చేస్తున్నారు. ఇక తర్వాతి తరం హీరోల్లో ఎక్కువగా రీమేక్‌లు చేసేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ‘సుస్వాగతం’తో మొదలుపెట్టి ‘వకీల్ సాబ్’ తరచుగా ఆయన రీమేక్‌లు చేశారు.
త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ‘భీమ్లా నాయక్’ సైతం రీమేకే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పవన్ హీరోగా మరో రీమేక్ ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. తమిళ చిత్రం ‘వినోదియ సిత్తం’ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో పవన్ హీరోగా నటించనున్నాడట. తెలుగులో ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ సహా పలు చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించిన సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఆయనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
గతంలో ‘శంభో శివ శంభో’కు ఆధారమైన ‘నాడోడిగల్’ సహా కొన్ని హిట్ సినిమాలను రూపొందించిన సముద్రఖని కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తనే హీరోగా ‘వినోదియ సిత్తం’ సినిమాను రూపొందించాడు.
ఓ నడి వయస్కుడైన వ్యక్తి ఒక ప్రమాదంలో చనిపోయాక ఇంకో మూడు నెలల పాటు బతికే అవకాశం పొందుతాడు. ఆ మూడు నెలల్లో తన తీరని కోరికలను ఎలా నెరవేర్చుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం నేరుగా జీ5లో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది.
ఈ ఏడాది వచ్చిన ఉత్తమ తమిళ చిత్రాల్లో దీన్నొకటిగా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. సముద్రఖనినే దర్శకత్వం వహిస్తాడట. నిర్మాణ సంస్థ ఏదన్నది వెల్లడి కాలేదు. ఈ సినిమా కన్ఫమ్ అయితే పవన్ చేస్తున్న 11వ రీమేక్ అవుతుందిది.
This post was last modified on December 16, 2021 10:44 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…