బాల కార్మికులను నిర్మూలించడనికి ఇటు కార్మిక శాఖ, అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా, నిబంధనలు విధించినా…ఇంకా బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కాలేదు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుబడ్ లోని చైల్డ్ ఆర్టిస్ట్ లను కూడా బాల కార్మికులుగా పరిగణించిన కార్మిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించి సినీ పరిశ్రమకు కొన్ని నిబంధనలు విధించింది.
సినిమాలు , సీరియల్స్ లో కొందరు చైల్డ్ ఆర్టిస్టులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిలో చాలామంది పాపులర్ కూడా అయ్యారు. అయితే, సినిమాల్లో నటించడం వల్ల వారి చదువుకు ఆటంకం కలుగుతుందని కార్మిక శాఖ భావించింది. అంతేకాదు, వారికి ఆర్థికం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుందని వారి సమస్యలపై దృష్టి పెట్టింది. అందుకే, 14 సంవత్సరాల్లోపు పిల్లలు ఇకపై ఏ రంగాల్లో పని చేయకూడదని తెలంగాణ కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి పత్రం తప్పనిసరి అని నిబంధన విధించింది. ఇకపై సినిమాల్లో బాల కార్మికులు కనిపించాలంటే కలెక్టర్లనుంచి సదరు సినిమా నిర్మాత, దర్శకుడు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతోపాటు, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని నిబంధన విధించింది. దీంతోపాటు, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కు సంబంధించిన 25% పేమెంట్ ను చిత్ర నిర్మాత జాతీయ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సూచించింది. చైల్డ్ ఆర్టిస్ట్ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on December 16, 2021 7:48 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…