ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 35ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని ఆదేశించింది. దీంతో, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
ఈ క్రమంలో నేడు ఆ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ కు టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు ముందుగా పంపించాలని ఆదేశించింది. సినిమా టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది.
అంతేకాకుండా, టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపించారు. అంతకుముందు, జీవో నం.35 కొట్టివేత సందర్భంగా హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.
కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని, ఆ హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సినిమా టికెట్ ధరలపై తగ్గింపు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. దీంతో, పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లను నిర్ణయించుకునే అధికారాన్ని థియేటర్ల యజమానులకు హైకోర్టు సింగిల్ బెంచ్ కల్పించింది. ఇక, హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా నిర్ణయంతో టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం జేసీల చేతికి వెళ్లింది.
This post was last modified on December 16, 2021 1:33 pm
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…