Movie News

RRR: యుఎస్ ఫ్యాన్స్.. రెడీనా?

బాహుబ‌లి త‌ర్వాత ఇండియాలో అత్య‌ధిక అంచ‌నాల‌తో రాబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌యే అన‌డంలో మ‌రో మాట లేదు. ఈ సినిమా మొద‌లైన‌పుడు బాహుబ‌లి మ్యాజిక్ రిపీట్ చేయ‌డం రాజ‌మౌళికి అంత తేలిక కాద‌ని అనుకున్నారు కానీ.. ఈ టాస్క్ మాస్ట‌ర్ త‌న కొత్త చిత్రం మీదా దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తిని రేకెత్తించ‌డంలో విజ‌య‌వంతం అయ్యాడు.

ఇప్ప‌టికే ఉన్న హైప్ ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్‌తో మ‌రింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాక విదేశాల్లోనూ ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. యుఎస్‌లో బాహుబ‌లి త‌ర‌హాలోనే ఆర్ఆర్ఆర్ సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి. అక్క‌డ ఈ సినిమా విడుద‌ల‌కు భారీ స్థాయిలోనే స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఏకంగా వెయ్యికి పైగా మ‌ల్టీప్లెక్సుల్లో ఆర్ఆర్ఆర్ విడుద‌లవుతుండ‌టం విశేషం. యుఎస్‌లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టికెట్ల రేట్లు ఎలా ఉండ‌బోతున్నాయ‌ని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా.. దీనికి సంబంధించి అప్‌డేట్ వ‌చ్చేసింది. జ‌న‌వ‌రి 7న రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు డిసెంబ‌రు 20న బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. వివిధ భాష‌ల్లో డిమాండ్‌ను బ‌ట్టి, అలాగే థియేట‌ర్లలో టెక్నాల‌జీ ఆధారంగా టికెట్ల రేట్ల‌ను నిర్ణ‌యించారు. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్ష‌న్ నార్మ‌ల్ థియేట‌ర్ల‌లో ప్రిమియ‌ర్ల‌కు 25 డాల‌ర్లు, రెగ్యుల‌ర్ షోల‌కు 22 డాల‌ర్లు టికెట్ ధ‌ర ఫిక్స్ చేశారు.

పిల్ల‌ల‌కు వ‌రుస‌గా ఈ ధ‌ర‌లు 18 డాల‌ర్లు, 15 డాల‌ర్లుగా ఉన్నాయి. ఎక్స్‌డీ, త్రీడీ, లాంటి లార్జ్ ఫార్మాట్ ఉన్న థియేట‌ర్ల‌లో టికెట్ ధ‌ర‌ ప్రిమియ‌ర్ల‌కు 28 డాల‌ర్లు, రెగ్యుల‌ర్ షోల‌కు 25 డాల‌ర్లుగా ఉంది. ఐమ్యాక్స్ స్క్రీన్ల‌లో ప్రిమియ‌ర్ల‌కైనా, రెగ్యుల‌ర్ షోల‌కైనా టికెట్ రేటు 30 డాల‌ర్లే. డాల్బీ విజ‌న్లో అయితే రేటు 35 డాల‌ర్లకు ఫిక్స్ చేశారు. తెలుగుతో పోలిస్తే మిగ‌తా వెర్ష‌న్ల‌కు రేట్లు త‌క్కువ ఉన్నాయి. ప్రిమియ‌ర్స్‌లో రెగ్యుల‌ర్ స్క్రీన్ల‌కు 16 డాల‌ర్లు, లార్జ్ స్క్రీన్ల‌కు 20 డాల‌ర్లు, డాల్బీ వెర్ష‌న్‌కు 22 డాల‌ర్లు రేట్ నిర్ణ‌యించారు. రెగ్యుల‌ర్ షోల‌కు ఇవే రేట్లు వ‌ర్తిస్తాయి.

This post was last modified on December 16, 2021 12:41 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago