ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల గొడవ కొన్ని నెలలుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాతో మొదలైన టికెట్ల రేట్ల నియంత్రణ.. తర్వాత కూడా కొనసాగుతోంది. పరిశ్రమ పెద్దలు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన మారట్లేదు. చివరికిప్పుడు ఏపీలో థియేటర్ల యజమానులు కోర్టుకెక్కడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఏప్రిల్‌కు ముందున్న రేట్లనే కొనసాగించాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.35ను వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యవహారంపై ఇప్పుడు సినీ ప్రముఖులెవరూ స్పందించడానికి ఇష్టపడట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో నందమూరి బాలకృష్ణ ఈ విషయమై స్పందించారు.
తన కొత్త చిత్రం అఖండ విజయయాత్రలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న బాలయ్యకు మంగళగిరిలో విలేకరుల నుంచి టికెట్ల రేట్ల వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. టికెట్ల రేట్లపై నియంత్రణను ముందే ఎత్తి వేస్తే అఖండకు మేలు జరిగేది కదా.. కోర్టు ఉత్తర్వులపై ఏమంటారు.. ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లబోతుండటంపై మీ స్పందనేంటి లాంటి ప్రశ్నలు బాలయ్యకు సంధించారు విలేకరులు. దీనికాయన బదులిస్తూ.. ‘‘ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరల విషయంపై ‘అఖండ’ విడుదలకు ముందు మేమంతా చర్చించాం.
కానీ, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా బాగా వచ్చింది. టికెట్ల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పుడే విడుదల చేద్దామన్నారు. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నారు. మరోవైపు మల్టీస్టారర్లు చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఎవరైనా మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని బాలయ్య బదులిచ్చారు.
This post was last modified on December 16, 2021 9:12 am
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…