ఈ మధ్యకాలంలో మలయాళంలో హిట్ అయిన చాలా సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలు మలయాళ సినిమాలకు రీమేక్ లనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘నాయట్టు’ అనే మరో మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో కరుణకుమార్ దర్శకుడిగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. గీతాఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాలనుకుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే సమయానికి సినిమాకి బ్రేకులు పడ్డాయట. రీమేక్ రైట్స్ విషయంలో గీతాఆర్ట్స్ కి, మలయాళ నిర్మాతలకు మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని.. అందుకే ‘నాయట్టు’ రీమేక్ కి పక్కన పెట్టేశారని సమాచారం.
ఇప్పటికే దర్శకుడు కరుణకుమార్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి.. మరో సినిమా కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ రీమేక్ రైట్స్ కి సంబంధించిన ఇష్యూని పరిష్కరించుకున్నా.. ఫ్యూచర్ లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ లేదని.. గీతాఆర్ట్స్ ఈ సినిమా చేయడానికి ఇక ఆసక్తి చూపించడం లేదని సమాచారం.
రీమేక్ హక్కులు చేతులు మారితే గనుక అప్పుడు సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు చాలా మంది గీతాఆర్ట్స్ ని అప్రిషియేట్ చేశారు. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను తెలుగులోకి తీసుకొస్తున్నారని పొగిడారు. మరిప్పుడు ఈ రీమేక్ సంగతేంటో..!
This post was last modified on December 14, 2021 10:49 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…