కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు తమ పెళ్లి సంగతిని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఆ విషయాన్ని ఇరువురు కుటుంబాల వారు కూడా ఎక్కడా బైటికి పొక్కనివ్వలేదు. అయినప్పటికీ దేశంలో వాళ్ల పెళ్లి గురించి మాట్లాడని మనిషి లేడు. నేషనల్ మీడియా నిండా ఆ వార్తలే. క్షణక్షణం వెడ్డింగ్ విశేషాలే. ఎట్టకేలకి వారి పెళ్లి అయిపోయింది అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి గురించిన చర్చ మొదలైంది.
చాలాకాలంగా రణ్‌బీర్‌తో ఆలియా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి నటిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కలిసి షికార్లు చేస్తున్నారు. టూర్లు వేస్తున్నారు. పెళ్లెప్పుడంటే మాత్రం ముసిముసి నవ్వులు నవ్వేసి తప్పించుకుంటున్నారు. టైమ్ వచ్చినప్పుడు చూద్దాం అంటూ రొటీన్ డైలాగులు చెప్పి డైలమాలో పడేస్తున్నారు. అయితే నిజానికి కత్రినా పెళ్లిలాగే వీరి పెళ్లి తతంగమంతా వెనకాల నడిచిపోతోంది అంటోంది నార్త్ మీడియా.
ఆలియా, రణ్‌బీర్‌ల పెళ్లికి ఆల్రెడీ ముహూర్తం ఫిక్సయ్యిందట. జనవరిలో వీరిరువురూ ఒక్కటి కానున్నారట. అయితే ప్రియాంక, దీపిక, కత్రినాల మాదిరిగా ఆలియా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం లేదు. ముంబైలోనే సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా వీరి పెళ్లి జరగబోతోందని సమాచారం.
అయితే ఇవి కూడా ఎవరో ఆకాశ రామన్న చెప్పిన కబుర్లే తప్ప ఎవరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసినవి కావు. దాంతో నమ్మాలా వద్దా అంటూ డైలమాలో పడక తప్పని పరిస్థితి. ఫ్యాన్సే లోకం, ఫ్యాన్సే ప్రపంచం అంటూ చెప్పే ఈ సెలెబ్రిటీలు.. వాళ్ల సంతోషం కోసం తమ పెళ్లి కబురును రివీల్ చేస్తే ఏం పోతుంది! ఇలా దాచి పెట్టడం వల్ల రకరకాల వార్తలు రావడం, అవి నిజమా కాదా అని అందరూ తలలు పగలుకొట్టుకోవడం అవసరమా!
This post was last modified on December 14, 2021 9:14 pm
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…
త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ…