అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఇంకో మూడు రోజుల్లోనే థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వివిధ భాషల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్లు పెద్దగా చేయడానికి చిత్ర బృందానికి అవకాశం లేకపోయింది. ఇప్పటిదాకా ఆన్ లైన్ ప్రమోషన్లతోనే హోరెత్తిస్తూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ ముంగిట హీరో బన్నీ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు.
తెలుగులో ప్రి రిలీజ్ ఈవెంట్ ముగించుకుని అతను చెన్నైలో అడుగు పెట్టాడు. ఈ ఈవెంట్లో బన్నీ పూర్తిగా తమిళంలో, చాలా స్పష్టంగా మాట్లాడి అక్కడి వారిని ఆకట్టుకున్నాడు. యుక్త వయసు వచ్చే వరకు బన్నీ తమిళనాడులోనే పెరిగిన నేపథ్యంలో అతడికి తమిళం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మరీ ఇంత స్పష్టంగా అతను తమిళం మాట్లాడగలడని ఎవరూ అనుకోలేదు. అక్కడి మీడియా వాళ్లు కూడా అతను నేటివ్ తమిళియన్ తరహాలో అనర్గళంగా తమిళంలో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు.
ఇక తన మూలాలు తమిళనాడులోనే ఉన్నాయని చెబుతూ.. తాను తమిళుడినే అని బన్నీ వ్యాఖ్యానించడం విశేషం. తాను పుట్టింది మద్రాస్‌లో అని, 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇక్కడే ఉన్నానని అతను గుర్తు చేసుకున్నాడు. స్కూల్లో తనతో కలిసి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్స్, తనకు చదువు చెప్పిన గురువులు అంతా ఇక్కడే ఉన్నారని.. ఇక్కడ తన సినిమా బాగా ఆడితే చూడాలన్నది తన కల అని అతను వివరించాడు. తన చిత్రాలు నార్త్ ఇండియాలో అనువాదమై చాలా బాగా ఆడాయని, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తొలి రెండు చిత్రాలు తనవే అని.. ఐతే ఉత్తరాదిన ఎంత ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ.. తాను పుట్టి పెరిగిన తమిళనాడులో తన సినిమా బాగా ఆడాలన్నది తన కోరిక అని చెప్పాడు.
ఐతే ఏదో ఒక సినిమాతో తమిళంలో అడుగు పెట్టకూడదన్న ఉద్దేశంతో, సరైన సినిమాతోనే రావాలని ఇంత కాలం ఆగానని.. ‘పుష్ప’ కచ్చితంగా ఇక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని అతనన్నాడు. మామూలుగా నాలుగు చిత్రాలకు పడే కష్టం ఈ ఒక్క సినిమాకు పడ్డామని.. తిరుపతిలో ఎర్రచందనం చుట్టూ తిరిగే కథ కావడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాతో రిలేటవుతారని.. తమిళ వెర్షన్ రచయిత, లిరిసిస్ట్ మదన్ కార్కీ కారణంగా మరింత ఎఫెక్టివ్‌గా తయారైందని, లైకా వాళ్లు పెద్ద ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని, కచ్చితంగా ఈ చిత్రం ఇక్కడ పెద్ద హిట్టవుతుందని బన్నీ ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on December 14, 2021 5:41 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…