ఒకప్పుడు ఐటెం సాంగ్ చేయడానికి ముమైత్ ఖాన్, హంసా నందిని లాంటి స్పెషలిస్టులు ఉండేవారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ఐటం సాంగ్స్‌ను తక్కువగా చూడకుండా స్టార్ హీరోయిన్లే ఆ పాటల్లో నర్తిస్తున్నారు. అదిరిపోయే స్టెప్పులేస్తూ, హాట్ హాట్‌గా కనిపిస్తూ ఆ పాటల స్థాయినే మార్చేశారు. ఐటెం సాంగ్స్‌లో సాహిత్యం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఆద్యంతం శృంగార రసం ఒలికిపోతుంటుంది. ఇలాంటి పాటలు చేసినపుడు స్టార్ హీరోయిన్లు కొంచెం ముందు వెనుక చూసుకోవాలి. కొన్నిసార్లు ఆ పాటలు తమ ఇమేజ్ మీద కూడా ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు సమంత విషయంలో అదే జరిగేలా ఉంది. ‘పుష్ప’ మూవీలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ అనే పాట ఆమె వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందేమో అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు. సమంత ఈ పాట చేయడం వల్ల సినిమాకు దక్కాల్సిన ప్రయోజనమంతా దక్కేలా ఉంది కానీ.. సమంతకు ఈ పాట మేలు చేస్తుందా.. చేటు చేస్తుందా అన్నదే ఇప్పుడు డిస్కషన్ పాయింట్.
ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంత హాట్‌గా కనిపించింది సమంత ఈ పాటలో. అలాగే మగాళ్ల వంకర బుద్ధుల్ని ఎత్తి చూపించేలా ఉందీ పాట. ఈ విషయాల్ని సమంత వ్యక్తిగత జీవితంలో ముడిపెట్టి చూస్తున్నారు జనాలు. ఉన్నట్లుండి ఇంత హాట్‌గా కనిపించడంలో ఆంతర్యం.. విడాకుల తర్వాత తనకు స్వేచ్ఛ లభించిందని చెప్పడమే అని కొందరంటుంటే.. ఇంకోవైపేమో సమంత ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌లో ఇలా హద్దులు దాటి నటించడం వల్లే చైతూతో ఆమెకు విభేదాలు తలెత్తాయని అప్పట్లో వ్యాఖ్యానాలు చేసిన వాళ్లు ఇప్పుడు ఇంకా రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.
విడాకుల విషయంలో తన బాధను, అసహనాన్ని తరచుగా వ్యక్తం చేస్తున్న సమంత.. ఆ ఫ్రస్టేషన్లోనే ‘పుష్ప’ ఐటెం సాంగ్ చేసిందని.. ఈ పాట లిరిక్స్ అలా ఉండటంలో ఆంతర్యం కూడా అదే అని విశ్లేషిస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనప్పటికీ ఈ పాటతో ఆమెకు వ్యక్తిగతంగా డ్యామేజ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె ఎదుర్కొంటున్న వ్యతిరేకతే ఇందుకు నిదర్శనం.
This post was last modified on December 13, 2021 5:27 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…