సుమ అనగానే యాంకరింగే గుర్తుకు వస్తుంది. రెండు దశాబ్దాలుగా తెలుగు యాంకరింగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ఆమె తనకు తానే సాటి అనిపిస్తోంది. ఐతే యాంకర్‌గా మారడానికి ముందు సుమ నటి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె కొన్ని సీరియళ్లలో, అలాగే దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలోనూ నటించింది సుమ. కానీ నటనలో కలిసి రాక అనుకోకుండా యాంకర్‌గా మారింది.
ఈ రంగంలో ఆమె ఎలా ఎదిగిందో.. ఎలా ఆధిపత్యాన్ని సాగిస్తోందో తెలిసిందే. ఐతే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ నటిగా మారడం విశేషం. ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. చకచకా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు కూడా సిద్ధమైపోయింది. ముందుగా ఈ చిత్రం నుంచి టీజర్ లాంచ్ చేశారు. జయమ్మ పంచాయితీ అంటే.. ఆమె పంచాయితీ పెద్దగా తీర్పులిస్తుందేమో అనుకున్నారు కానీ.. ఈ సినిమా కథాంశం అది కాదు. ఆమెకు సంబంధించిన ఒక పంచాయితీ.. ఊరి పెద్దల ముందుకు వస్తుంది.
ఆ పంచాయితీ ఏంటన్నది టీజర్లో వివరించలేదు కానీ.. అది చాలా చిత్రమైన సమస్య అని.. కథ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుందని.. ఈ నేపథ్యంలో కావాల్సినంత కామెడీ పండించారని అర్థమవుతుంది. సీరియస్‌గా కనిపిస్తూనే సుమ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయబోతోందని టీజర్ సంకేతాలు ఇచ్చింది. ఇన్నేళ్లు యాంకర్‌గా చూసిన సుమను నటిగా చూసి కన్విన్స్ కాగలమా అన్న అనుమానాలు తలెత్తాయి కానీ.. సుమ తనదైన శైలిలో ఈ పాత్రను పండించినట్లుగా కనిపిస్తోంది.
టీజర్లో సుమను చూసిన వాళ్లు షాకవడం ఖాయం. ‘‘మంచం మీద పడ్డోడి గురించి ఈ పంచాయితీ ఏంటి’’ అని పంచాయితీ పెద్ద అంటే.. ‘‘నా మొగుడు నా మంచం మీదే పడ్డాడు. నీ పెళ్లాం ఎవరెవరి మంచాల్లో పడుకుందో ఇక్కడ చెప్పమంటావా’’ అన్న సుమ డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. విజయ్ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్నిబలగ ప్రకాష్ నిర్మించాడు. టీజర్‌తో ‘జయమ్మ పంచాయితీ’ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేసింది
This post was last modified on December 13, 2021 3:31 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…