అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. కొంచెం ఫ్యామిలీ టచ్ ఇచ్చాన ఓకే కానీ.. లవ్ స్టోరీలను కాదని వేరే ఏ జానర్ ట్రై చేసినా అతడికి వర్కవుట్ కావట్లేదు. తాను కూడా యాక్షన్ హీరోగా గుర్తింపు సంపాదించి మాస్‌లో ఫాలోయింగ్ పెంచుకోవాలని, మార్కెట్‌ను విస్తరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ.. ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది.
చైతూను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగాలని చూసిన దర్శకులందరూ ఫెయిలయ్యారు. ఐతే చైతూకు ‘మనం’ లాంటి మరపురాని సినిమాను అందించిన విక్రమ్ కుమార్.. ఈసారి అతణ్ని కొత్త రూట్లోకి తీసుకెళ్తున్నాడని.. తన ఫస్ట్ హిట్ ‘13 బి’ సీక్వెల్‌ను చైతూతో చేయబోతున్నాడని.. చైతూ కూడా విక్రమ్‌ను నమ్మి మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడని వార్తలొచ్చాయి.
ఐతే ఈ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. చైతూతో తాను చేయబోయే సినిమా ‘13 బి’కి సీక్వెల్ కాదని.. అదసలు హార్రర్ థ్రిల్లర్ ఎంతమాత్రం కాదని ఓ ఇటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు విక్రమ్. చైతూతో తాను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నానని.. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంటుందని ఆయన వెల్లడించాడు. అంటే చైతూ మళ్లీ ఎప్పట్లాగే తన కంఫర్ట్ జోన్‌కే పరిమితం అవుతున్నాడన్నమాట.
‘మనం’ తర్వాత తనపై అంచనాల్ని భారీగా పెంచేసిన విక్రమ్.. హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో ఆ అంచనాల్ని అందుకోలేకపోయాడు. అతడికి హిట్ చాలా అవసరం. చైతూ మధ్యలో ఎదురు దెబ్బలు తిన్నా.. ‘మజిలీ’తో కోలుకున్నాడు. ప్రస్తుతం అతను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చేస్తున్నాడు.
లాక్ డౌన్ తర్వాత ఆ చిత్రాన్ని పూర్తి చేసి.. వెంటనే విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు.
This post was last modified on June 8, 2020 4:58 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…