కరోనా కారణంగా వెలవెలబోయిన థియేటర్లు సెకెండ్ వేవ్ తర్వాత తెరుచుకున్నాయి. అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా మాత్రం వెంటనే దొరకలేదు. అఖండ వచ్చాకే మాస్ జాతర మొదలైంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొట్టింది. రిలీజై పది రోజులయ్యాక కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఓవర్‌సీస్‌లో సైతం దూకుడు చూపిస్తోంది. ఈమధ్య కాలంలో ఈ రేంజ్‌లో ఆడిన తెలుగు సినిమా మరొకటి లేదంటూ ఒకటే ప్రశంసలు.
మరి ఇన్ని రికార్డులు సృష్టించిన సినిమాపై బాలీవుడ్ వారి కన్ను పడకుండా ఉంటుందా? ఓ మాదిరి సినిమాలనే పట్టుకుపోయి రీమేక్ చేస్తున్న బీటౌన్ ఫిల్మ్ మేకర్స్ అఖండను మాత్రం వదులుతారా? అందుకే రిలీజైన మూడు నాలుగు రోజులకే హిందీ రీమేక్ టాపిక్ తెరపైకొచ్చింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బేరాలు నడుస్తున్నాయని, పెద్ద పెద్ద సంస్థలన్నీ పోటీ పడుతున్నాయని అన్నారు. ఎట్టకేలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రైట్స్ చేజిక్కించుకుందని టాక్.
ఈ విషయాన్ని ఇంకా ఎవరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయకముందే హిందీలో బాలయ్య పాత్రని ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అజయ్ దేవగన్ కానీ అక్షయ్ కుమార్ కానీ అయితేనే సూపర్‌గా ఉంటుందనే కంక్లూజన్‌కి వచ్చారంతా. మాస్ మూవీ కాబట్టి అజయ్ కంటే అక్షయ్ అయితే బెటరని ఎక్కువమంది ఫీలవుతున్నారు. వారిలో ఒకరు ఈ సినిమా చేస్తున్నారని కూడా కన్‌ఫర్మ్ చేసేస్తున్నారు కొందరు.
ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఇంత బజ్ రావడం చూస్తుంటే అఖండ ఏ రేంజ్‌లో విజయం సాధించిందనేది మాత్రం అర్థమవుతోంది. బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ చేసిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే అఖండ కూడా సక్సెస్ అవుతుందని మొదట్నుంచీ నమ్మారంతా. అయితే ఈ రేంజ్ సక్సెస్‌ని మాత్రం ఊహించలేదు. మొత్తానికి బాలయ్య ఒక్క దెబ్బతో నార్త్ వారిని కూడా తనవైపు తిప్పేసుకున్నాడు.
This post was last modified on December 12, 2021 6:28 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…