‘మహానటి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన నటి కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. అందులో ఒకటి.. పెంగ్విన్. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ భాషల్లో నలుగురు కథానాయికలు (సమంత, మంజు వారియర్, తాప్సి, త్రిష) ఈ చిత్ర టీజర్‌ను సోమవారం లాంచ్ చేశారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు తగ్గట్లే టీజర్ కూడా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది హింట్ ఇచ్చింది. ఇది మాతృత్వం మీద నడిచే కథ. ఒక తల్లి తన బిడ్డ కోసం పడే ఆరాటం నేపథ్యంలో కథ నడుస్తుందన్న సంకేతాలు టీజర్ ఇచ్చింది.
కథ మరీ ఎక్కువేమీ రివీల్ చేయకుండా హీరోయిన్ బిడ్డ కోసం తపించే తీరును కొన్ని విజువల్స్ ద్వారా చూపించారు. ప్రతి వ్యక్తి కథ వెనుక ఓ అమ్మ కథ ఉంటుందని.. ఎందుకంటే అందరి కథ అక్కడి నుంచే మొదలవుతుందని చెప్పడం ద్వారా ఈ కథ ఉద్దేశమేంటో కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. టీజర్ రెండో అర్ధంలో ఒక క్రిమినల్ ముఖానికి చార్లీ చాప్లిన్ మాస్కు తగిలించుకుని ఒక వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసే దృశ్యం చూపించారు.
దీన్ని బట్టి సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని.. ఉత్కంఠ రేకెత్తిస్తుందని స్పష్టమవుతోంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇతర టెక్నికల్ అంశాలన్నీ హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్ని తలపిస్తున్నాయి. కీర్తిలోని నటికి మంచి అవకాశమిచ్చే సినిమాలాగే కనిపిస్తోంది ‘పెంగ్విన్’. టీజర్లో ఆమె తప్ప మరో నటుడి ముఖం చూపించలేదు.
ఈ నెల 11న ‘పెంగ్విన్’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. జ్యోతిక నటించిన ‘పొన్ మగల్ వందాల్’ తుస్సుమనిపించిన నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజవుతున్న ఈ సినిమా అయినా మంచి ఫలితాన్నందుకుంటుందుేమో చూడాలి.
This post was last modified on June 8, 2020 4:41 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…