‘బాహుబలి’ లాంటి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్లలో వ్యూస్ సంపాదిస్తూ.. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది ఈ ట్రైలర్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఓ రేంజ్ లో చూపించారు. ఎన్టీఆర్-పులి షాట్ ట్రైలర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న సినిమాను విడుదల చేస్తుండడంతో దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమాలో పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం వరంగల్ సిటీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో వరంగల్ సిటీకి సంబంధించి ఒక ఎలిమెంట్ ఉంటుందని.. అందుకే అక్కడే ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.
రియల్ లైఫ్ లో అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ డిఫరెంట్ టైం జోన్స్ లో కొంతకాలం వరంగల్ లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకేనేమో.. రాజమౌళి కూడా వరంగల్ లో ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ నుంచి కొందరు గెస్ట్ లుగా హాజరు కాబోతున్నారు.
This post was last modified on December 11, 2021 4:21 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…