Movie News

ఎన్టీఆర్‌‌కు ఎన్ని భాషలొచ్చు?

జూనియర్ ఎన్టీఆర్ నైపుణ్యాల గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నతనంలోనే బాల రామాయణం సినిమాలోనే నటుడిగా తనేంటో రుజువు చేశాడు. ఇక టీనేజీలోనే స్టార్ స్టేటస్ సంపాదించి ఔరా అనిపించాడు. నటన విషయంలోనే అనర్గళంగా డైలాగ్స్ చెప్పడంలో అతడి ప్రతిభను ఎప్పట్నుంచో అందరూ చూస్తూనే ఉన్నారు. ‘యమదొంగ’లో సుదీర్ఘమైన గ్రాంథిక డైలాగ్‌ను అద్భుతంగా పలికి అందరినీ విస్మయానికి గురిచేశాడు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా అతడి ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోతుంటారు.

అతడి వాక్చుతుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు లాంటి షోలను ఎంత చక్కగా హోస్ట్ చేశాడో తెలిసిందే. తారక్ ఏక సంతాగ్రాహి అని.. దేన్నయినా కాసేపట్లో నేర్చేసుకుంటాడని.. పర్ఫెక్షన్‌తో డెలివర్ చేస్తాడని అందరూ కొనియాడుతుంటారు. ఇప్పుడు అతడి బహుముఖ ప్రజ్ఞ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి రెండు రోజుల వ్యవధిలో నాలుగు సిటీలు తిరిగాడు తారక్. గురువారం ముంబయిలో, శుక్రవారం బెంగళూరు, చెన్నై, కోచి సిటీల్లో ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు.

ప్రతి చోటా తన వాక్చాతుర్యంతో ఆశ్చర్యపరిచాడు. ముంబయిలో హిందీలో అదరగొట్టిన తారక్.. బెంగళూరులో కన్నడలో, చెన్నైలో తమిళంలో ఏ తడబాటూ లేకుండా చక్కగా మాట్లాడేశాడు. ఆయా భాషల్లో ప్రశ్నలు వేస్తే.. ఏ ఇబ్బందీ లేకుండా ఆ భాషల్లోనే జవాబులు ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్‌కు ఎన్ని భాషలొచ్చు.. భాష తెలిసినా సరే ఇంత పర్ఫెక్షన్ ఎలా సాధ్యం అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్లో పర్ఫెక్షన్‌తో హిందీ, కన్నడ, తమిళ భాషల్లో డైలాగులు పలికిన విధానానికి అంతా ఆశ్చర్యపోయారు.

చరణ్ కూడా బాగానే డైలాగులు చెప్పినప్పటికీ.. ఎన్టీఆర్‌ది వేరే లెవెల్ అనే చెప్పాలి. ఐతే కావాల్సినన్ని టేక్స్ తీసుకుని డబ్బింగ్ చెప్పడం వేరు. ముందు మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తుంటే వారి భాషల్లో తడబాటు లేకుండా జవాబులు చెప్పడం వేరు. ముఖ్యంగా బెంగళూరులో విలేకరులతో కన్నడలో అనర్గళంగా మాట్లాడిన తీరుకు అంతా ఫిదా అయిపోయారు. అంతే కాక పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకుంటూ అతడి కోసం తాను పాడిన గెలయా గెలయా పాటను మరోసారి ఆలపించడం, ఇంకెక్కడా ఆ పాట పాడబోనని చెప్పడం అందరినీ కదిలించేసింది

This post was last modified on December 11, 2021 2:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐటీ అంటే చంద్ర‌బాబు.. యంగ్ ఇండియా అంటే నేను : రేవంత్ రెడ్డి

ముఖ్య‌మంత్రుల 'బ్రాండ్స్‌'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ముఖ్య‌మంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంద‌న్నారు. "రెండు…

5 minutes ago

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్టు!

బీఆర్ఎస్ నాయ‌కుడు, బోధ‌న్ నియోజ‌క‌వర్గం మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్ట‌య్యారు. రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఘ‌ట‌న‌లో త‌న కుమారుడిని స‌ద‌రు…

1 hour ago

కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…

2 hours ago

జ‌గ‌న్ స‌తీమ‌ణిపై దుర్భాష‌లు.. టీడీపీ నేత‌పై బాబు క‌ఠిన చ‌ర్య‌లు

త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. త‌న పార్టీవారిని కూడా వ‌దిలి…

2 hours ago

పాత వాహనాలపై కొత్త నిబంధనలు.. లేదంటే కేసే!

మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…

2 hours ago

పెద్ది అసలు కథ వేరే ఉంది

ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…

3 hours ago