తమిళ దర్శకులు తెలుగు హీరోలతో తెలుగులో సినిమాలు చేయడం మామూలే. మణిరత్నం మొదలుకుని మురుగదాస్ వరకు చాలామంది తమిళ స్టార్ డైరెక్టర్లు తెలుగులో సినిమాలు చేశారు. కానీ తెలుగు దర్శకులు తమిళంలో సినిమాలు చేసిన దాఖలాలు దాదాపు కనిపించవు. అక్కడి హీరోలూ ఇటు వైపు చూడరు. ఇక్కడి దర్శకులు అటు వైపు కన్నేయరు.
ఐతే ధనుష్ లాంటి పెద్ద హీరో మన తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయితే.. అతను అంగీకరించలేదట. ఈ ఆఫర్‌ను తిరస్కరించిన దర్శకుడు మరెవరో కాదు.. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో పరిచయమైన వేణు ఉడుగుల. అతడి తొలి సినిమానే తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
సీనియర్ నిర్మాత కలైపులి ఎస్.థాను ధనుష్ హీరోగా నీదీ నాదీ ఒకే కథ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో ధనుష్ ఓ కండిషన్ పెట్టాడట. ఒరిజినల్ తీసిన దర్శకుడైతేనే చేస్తానని అన్నాడట. ఈ సినిమా కోసం వేణును అడిగితే.. అతను కుదరదనేశాడట. దీని గురించి వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నీదీ నాదీ ఒకే కథ సినిమా చేయడానికి తనకు మూడేళ్ల సమయం పట్టిందని.. రీమేక్ కోసం మళ్లీ ఒకట్రెండేళ్లు పెట్టాలనిపించలేదని.. అప్పటికే విరాట పర్వం కథ తన మెదడులో తిరుగుతుండటంతో తెలుగులోనే రెండో సినిమా చేయాలని ఫిక్సయ్యానని.. అందుకే ధనుష్‌తో నీదీ నాదీ ఒకే కథ రీమేక్ చేయడానికి అంగీకరించలేదని చెప్పాడు వేణు.
విరాట పర్వం సినిమా కోసం ముందు తమిళ కథానాయకుడు కార్తిని అనుకున్నానని.. కానీ అతణ్ని సంప్రదించకుండా రానాను అడగడం.. అతను వెంటనే ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కడం జరిగాయని వేణు తెలిపాడు.
This post was last modified on June 8, 2020 3:00 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…